హైద్రాబాద్ కు డ్రగ్స్ సరఫరా: గోవాలో స్టీఫెన్ డిసౌజాను అదుపులోకి తీసుకున్న తెలంగాణ పోలీసులు

By narsimha lode  |  First Published Sep 22, 2022, 9:40 AM IST

గోవా కేంద్రంగా హైద్రాబాద్ సహ పలు ప్రాంతాకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీఫెన్ డిసౌజాను తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నార్కోటిక్ వింగ్స్, ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి డిసౌజాను అదుపులోకి తీసుకున్నారు. 


హైదరాబాద్: తెలంగాణ నార్కోటిక్ ఎన్‌ఫోర్స్ మెంట్ వింగ్ గోవాలో ఆపరేషన్ చేపట్టింది. డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీఫెన్ డిసౌజాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తెలంగాణతో  పాటు పలు రాష్ట్రాలకు స్టీఫెన్ డిసౌజా  డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని నార్కోటిక్ వింగ్ గుర్తించింది. 

గోవా కేంద్రంగా హైద్రాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేస్తున్న స్టీఫెన్ డిసౌజా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. హైద్రాబాద్ తో పాటు  ఏపీ, బెంగుళూరు, చెన్నైకి కూడా స్టీఫెన్ డ్రగ్స్ సరఫరా  చేస్తున్నారని నార్కోటిక్స్ వింగ్ తెలిపింది.  గోవా పోలీసులకు కూడా స్టీఫెన్ డిసౌజా మోఃస్ట్ వాంటెడ్ గా ఉన్నాడు.  ఏజంట్లను ఏర్పాటు చేసుకొని డిసౌజా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.  నార్కోటిక్ వింగ్స్ తో పాటు ఉస్మానియా యూనివర్శిటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ నిర్వహించి  డీసౌజాను అదుపులోకి తీసుకున్నారని మీడియా రిపోర్ట్ చేసింది. తెలుగు న్యూస్ చానెల్స్ తో పాటు గోవాలోని స్థానిక మీడియా కూడ ఈ విషయమై కథనాలు ప్రచురించింది.

Latest Videos

తెలంగాణ రాష్ట్రానికి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారిని గుర్తించి వారిని అరెస్ట్  చేయడంపై  పోలీస్ శాఖతో పాటు  ఎక్సైజ్ శాఖాధికారులు  చర్యలు చేపట్టారు. రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ సీటీగా మార్చాలని  సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు.  కేసీఆర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ సరఫరాదారులతో పాటు డ్రగ్స్ తీసుకుంటున్నవారిపై  పోలీసు శాఖ కేంద్రీకరించింది.  హైద్రాబాద్ లో డ్రగ్స్ కొనుగోలు చేస్తున్నవారిని కూడా అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. కొందరు వ్యాపారులు డ్రగ్స్ కొనుగోలు దారులుగా ఉన్నారని హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ ప్రకటించారు. మరో వైపు కాలేజీలు, స్కూల్స్ కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిని గుర్తించి కొందరిని అరెస్ట్ చేశారు. డ్రగ్స్ తో పాటు గంజాయిని సరఫరా చేస్తున్నవారిపై  ఎక్సైజ్, పోలీస్ శాఖలు కేంద్రీకరించాయి. 

హైద్రాబాద్ సీపీగా సీవీ ఆనంద్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత ముంబై నుండి హైద్రాబాద్ కు డ్రగ్స్ సరఫరా చేసే కీలక నిందితుడు టోనిని కూడ పోలీసులు అరెస్ట్ చేశారు. చాలా కాలంగా పోలీసుల కళ్లుగప్పి టోని ముంబై కేంద్రంగా డ్రగ్స్ సరఫరా చేస్తున్నారని పోలీసులు అనుమానిస్తున్నారు.. ఏజంట్లను ఏర్పాటు చేసుకొని డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు. 
 

click me!