డ్రగ్స్ తీసుకున్న వారిలో ఎక్కువమంది అమ్మాయిలేనన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీగా మార్చడానికి నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేస్తామని సీవీ ఆనంద్ చెప్పారు.
డ్రగ్స్ తీసుకున్న వారిలో ఎక్కువమంది అమ్మాయిలేనన్నారు హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్‌కి అలవాటుపడ్డ అమ్మాయిలకి కౌన్సెలింగ్ ఇస్తున్నామన్నారు. వాళ్లను సాధారణ జీవితానికి అలవాటుపడేలా చేస్తున్నామని సీపీ తెలిపారు. కోవిడ్ సమయంలో చాలా మంది గంజాయి, డ్రగ్స్‌కి అలవాటుపడ్డారని సీవీ ఆనంద్ పేర్కొన్నారు. దేశంలో 11.5 కోట్ల మంది డ్రగ్స్‌కు అలవాటుపడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణను డ్రగ్స్ ఫ్రీగా మార్చడానికి నార్కోటిక్ బ్యూరోను ఏర్పాటు చేస్తామని సీవీ ఆనంద్ చెప్పారు.
కాగా.. ప్రస్తుతం మరోసారి టాలీవుడ్ డ్రగ్స్ కలకలం చెలరేగింది. కేపీ చౌదరి అనే నిర్మాత డ్రగ్స్ విక్రయిస్తూ కొన్నిరోజుల క్రితం అరెస్ట్ అయ్యారు. నిర్మాత కేపీ చౌదరి డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు టాలీవుడ్‌లో కలకలం రేపుతుంది. కేపీ చౌదరి కస్టడీ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలను ప్రస్తావించారు. పోలీసుల విచారణలో 12 మందికి తాను డ్రగ్స్ సరఫరా చేసినట్లు కేపీ చౌదరి ఒప్పుకున్నట్లు పేర్కొన్నారు.
ALso Read: కేపీ చౌదరి నాకు ఫ్రెండ్, ఫోన్ లో మాట్లాడాను.. కానీ డ్రగ్స్ తో సంబంధమే లేదు, నటి జ్యోతి రియాక్షన్
11 అనుమానాస్పద లావాదేవీలు గుర్తించినట్లు తెలిపారు. రఘు తేజ, సనా మిశ్రా, సుశాంత్ రెడ్డి, నితినేశ్, బెజవాడ భరత్, శ్వేత, ఠాగూర్ ప్రసాద్ తదితరులు తన వద్ద నుంచి డ్రగ్స్ కొనుగులో చేసినట్టుగా కేపీ చౌదరి చెప్పినట్టుగా కస్టడీ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు. అయితే వీరితో కేపీ చౌదరి.. చాలా కాల్స్ మాట్లాడినట్టుగా పోలీసులు గుర్తించారు. అషూరెడ్డి, సురేఖా వాణిలతో పాటు మరికొందరితో కేపీ చౌదరి వందల కాల్స్ మాట్లాడినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పోలీసులు పేర్కొన్నారు.