‘‘ నా భర్తను చంపేశారు.. ఈ తాళి నాకెందుకు ’’ .. సీఐపై మంగళ సూత్రాన్ని విసిరికొట్టిన మహిళ

By Siva KodatiFirst Published Jun 16, 2022, 3:40 PM IST
Highlights

రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. తన భర్తను హత్య చేసిన వారికి పోలీసులు అండగా నిలుస్తున్నారంటూ హత్యకు గురైన వ్యక్తి భార్య పోలీసులతో వాగ్వాదానికి దిగింది. అంతేకాకుండా సీఐపై తాళిబొట్టును విసిరికొట్టింది. 
 

ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలతో జరిగిన హత్య పోలీస్ స్టేషన్‌పై దాడి వరకు వెళ్లింది. రాజన్న సిరిసిల్ల జిల్లా (rajanna sircilla) రుద్రంగిలో (rudrangi) ఈ ఘటన జరిగింది. నెపూరి నర్సయ్య అనే వ్యక్తిని ట్రాక్టర్‌తో ఢీకొట్టి హత్య చేశాడు ప్రత్యర్ధి కిషన్ అనే వ్యక్తి. హత్యకు కిషన్ అనే వ్యక్తే కారణమని భావించిన మృతుడి బంధువులు అతను పోలీసుల అదుపులో వున్నాడని తెలుసుకుని అక్కడికి వెళ్లారు. అనంతరం ఆగ్రహంతో స్టేషన్‌పై దాడికి దిగారు. అడ్డొచ్చిన పోలీసులను చితకబాదారు. 

రుద్రంగి ఎస్ఐ, చందుర్తి సీఐ వల్లే ఈ హత్య జరిగిందని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. పోలీసుల తీరుపై మృతుడి భార్య తీవ్రంగా మండిపడ్డారు. వేధింపుల కారణంగానే తన భర్త చనిపోయాడని.. ఇక తనకు తాళి బొట్టు అక్కర్లేదంటూ చందుర్తి సీఐపైనే మంగళ సూత్రాన్ని విసిరేసింది. బంధువుల ఆందోళనలతో పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. దీంతో వేములవాడ డీఎస్పీ నాగేంద్ర చారి అతనికి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నారు. 
 

click me!