Telangana

పాతబస్తీలో ఘర్షణ: సంఘటనా స్థలికి సీపీ (వీడియో)

24, Jan 2019, 10:40 AM IST

హైదరాబాదులోని పాతబస్తీలో రెండు వర్గాల మధ్య ఘర్షణతో పాతబస్తీలో ఉద్రిక్తత నెలకొంది. హుస్సేనీ ఆలంలో చిన్నపాటి వివాదంతో రెండు వర్గాలు పరస్పరం దాడికి పాల్పడ్డాయి. ఈ ఘర్షణలో పలువురు తీవ్రంగా గాయపడ్డారు. 

విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు. నగర కమిషనర్, సౌత్‌జోన్ డీసీపీ ఘటనా స్థలికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.