రంగారెడ్డి జిల్లాలో బస్టాండ్ లో పడుకున్న ఓ యువతిపై ఇద్దరు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రంగారెడ్డి : తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో దారుణ ఘటన వెలుగు చూసింది. అపస్మాత స్థితిలో ఉన్న మహిళపై ఇద్దరి వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీనికి సంబంధించిన వివరాలలోకి వెడితే.. బస్టాండ్లో నిద్రపోతున్న యువతి మీద ఇద్దరు వ్యక్తులు అత్యాచారం చేసినట్లుగా సమాచారం. ఈ ఘటన చేవెళ్ల పోలీస్ స్టేషన్ పరిధిలోనే వెలుగు చూసింది. దీనికి సంబంధించి పోలీసులు ఈ మేరకు వివరాలు తెలియజేస్తున్నారు.
బాధితురాలు కేశంపేట మండలం కొత్తపేట గ్రామానికి చెందిన 20 ఏళ్ల యువతి. ఆమెకు నాలుగు నెలల క్రితం వివాహం అయ్యింది. పెళ్లయిన తర్వాత వారం రోజులకే భర్తతో ఆ యువతికి విభేదాలు వచ్చాయి. దీంతో అప్పటినుంచి పుట్టింట్లోనే ఉంటుంది. ఆదివారం నాడు తల్లిదండ్రులతో గొడవపడింది. కోపంతో ఇంట్లో నుంచి బయటికి వచ్చి చేవెళ్లలో ఉంటున్న తన సోదరి ఇంటికి వెళ్ళింది.
హైకోర్టు మాజీ న్యాయమూర్తి న్యాయమూర్తి జస్టిస్ భాస్కరరావు కన్నుమూత..
అక్కడికి వచ్చేసరికి ఆమె అక్క ఇంటి దగ్గర లేదు. దీంతో, తల్లిదండ్రులతో గొడవపడి వచ్చింది కాబట్టి, వెంటనే తిరిగి ఇంటికి వెళ్లలేక పోయింది. దగ్గర్లో ఉన్న కల్లు కాంపౌండ్ కు వెళ్లి కల్లు తాగింది. తర్వాత బస్టాండ్ కు తిరిగి వచ్చింది. తిరిగి ఊరికి వెళదామని అనుకుంది. అయితే, ఆ సమయంలో తమ ఊరికి వెళ్లడానికి బస్సులు లేవు. కల్లు కూడా తాగడంతో ఆమెకు నిద్రమత్తు వచ్చి బస్టాండ్ లోనే పడుకుండిపోయింది.
యువతి ఒంటరిగా ఉండడం, అపస్మానిక స్థితిలో ఉండడం చూసిన ఇద్దరు యువకులు ఆమెమీద కన్నేశారు. రాత్రి పది గంటల సమయంలో బస్టాండ్ లో జనసంచారం తగ్గిన తరువాత.. ఎవరూ లేని సమయాన్ని అదనుగా తీసుకొని… ఆమె మీద అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ తర్వాత అక్కడ నుంచి పరారయ్యారు. ఆ కాసేపటికి బస్టాండుకు వచ్చిన కొందరు వ్యక్తులు యువతిని గమనించారు. యువతి వివస్త్రగా ఉండడం చూసి పోలీసులకు విషయాన్ని తెలిపారు.
వారి సమాచారం మేరకు అక్కడికి చేరుకున్న పోలీసులు.. అప్పటికి ఇంకా అపస్మారక స్థితిలోనే ఉన్న యువతిని ఆస్పత్రికి తరలించారు. నిందితుల కోసం బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించారు. దీంట్లో చేవెళ్లకు చెందిన రాజు, అనిల్ కుమార్ లు యువతి మీద అత్యాచారానికి పాల్పడినట్లుగా గుర్తించారు. వెంటనే వారిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రిమాండ్కు తరలించారు.
ఇదిలా ఉండగా, విద్యాబుద్ధులు నేర్పి.. ఇలాంటి ఘటనే ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా కదిరి నియోజకవర్గంలో వెలుగు చూసింది. ఈ నియోజకవర్గానికి చెందిన ఓ పదహారేళ్ల బాలిక ఏడాది కిందట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతుండేది. ఓ రోజు దాహం వేసి నీళ్లు తాగడానికి స్టాఫ్ గదిలోకి వెళ్ళింది. ఆ సమయంలో అక్కడే ఉన్నరెడ్డి నాగయ్య అనే టీచర్ ఆ బాలిక మీద అత్యాచారానికి పాల్పడ్డాడు. విషయాన్ని ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ బాలికను తీవ్రంగా బెదిరించాడు.
దీంతో బాలిక భయంతో మిన్నకుండిపోయింది. బాలిక మౌనంగా ఉండిపోవడాన్ని అదునుగా తీసుకున్న సదరు కీచక టీచర్.. ఆ బాలిక మీద బెదిరింపులకు పాల్పడుతూ అనేకమార్లు అత్యాచారం చేశాడు.ఈ క్రమంలో శనివారం బాలిక కడుపునొప్పితో బాధపడింది. దీంతో వెంటనే కుటుంబసభ్యులు స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి ఆమెను తీసుకెళ్లారు. బాలికను పరీక్షించిన వైద్యులు ఆమె గర్భవతి అని తేల్చారు. ప్రసవం చేసి పండంటి మగబిడ్డకి జన్మనిచ్చారు. విషయం తెలియడంతో కదిరి డిఎస్పి శ్రీలత బాధిత బాలికను అనంతపురం ఆసుపత్రిలో పరామర్శించారు. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు ఫోక్సో చట్టం, 376, 506 సెక్షన్ల కింద నిందితుడి మీద కేసు నమోదు చేసినట్లుగా పోలీసులు తెలిపారు.