Telangana

ఖాన్ లతీఫ్ ఖాన్ భవనంలో అగ్నిప్రమాదం (వీడియో)

23, Jan 2019, 4:35 PM IST

బషీర్‌బాగ్‌లోని ఖాన్‌లతీఫ్‌ఖాన్ భవనంలో ఇవాళ మధ్యాహ్నం అగ్నిప్రమాదం సంభవించింది. భవనంలోని ఐదో అంతస్తులో మంటలు చెలరేగాయి. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మంటలను ఆర్పేందుకు యత్నిస్తున్నారు. భవనంలోని ఉద్యోగులు, సిబ్బందిని పోలీసులు సురక్షితంగా బయటకు పంపించారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.