సికింద్రాబాద్ లో డ్రగ్స్ సీజ్: ఒకరి అరెస్ట్, కొకైన్ స్వాధీనం

By narsimha lode  |  First Published Jul 27, 2022, 2:43 PM IST

సికింద్రాబాద్ లో మరోసారి డ్రగ్స్ పట్టుబడ్డాయి. 16 గ్రాముల కొకైన్ ను ఎక్సైజ్  అధికారులు సీజ్ చేశారు. ఈ కేసులో జూబ్లీహిల్స్ కు చెందిన వినీత్ అగర్వాల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. నగరంలో డ్రగ్స్ విక్రయించేవారితో పాటు డ్రగ్స్ తీసుకొనే వారిపై పోలీసులు నిఘాను పెంచారు. 
 



హైదరాబాద్:సికింద్రాబాద్ లో మరోసారి Drugs పట్టుబడ్డాయి. 16 గ్రాముల కొకైన్ ను ఎక్సైజ్ అధికారులు బుఁధవారం నాడు సీజ్ చేశారు. ఈ కేసులో జూబ్లీహిల్స్ కు చెందిన వినీత్ అగర్వాల్ ను Arrest చేశారు. అగర్వాల్ ఉపయోగించిన కారును కూడా Excise  పోలీసులు సీజ్ చేశారు.  హైద్రాబాద్ సహా తెలంగాణ రాష్ట్రాన్ని డ్రగ్స్ ఫ్రీ సిటీ గా చేయాలనే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుంది. ఈ మేరకు ఎక్సైజ్, పోలీసు శాఖాధికారులతో తెలంగాణ సీఎం KCR  సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ లేని రాష్ట్రంగా మార్చేందుకు అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. డ్రగ్స్ సరఫరా చేసే వారిపై నిఘాను ఏర్పాటు చేశారు.

ఈ నెల 4వ తేదీన కూడా నగరంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. హైద్రాబాద్ ఎస్ఆర్ నగర్ లో డ్రగ్స్  విక్రయిస్తూ ముగ్గురిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి 30 గ్రామలు ఎండీఎంఏను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.Delhi నుండి డ్రగ్స్ ను తీసుకొచ్చి హైద్రాబాద్ లో విక్రయిస్తున్నారని పోలీసులు గుర్తించారు.పుణెకి చెందిన ప్రధాన నిందితుడు సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఏడాది మే 24న ధూల్ పేటలో డ్రగ్స్ ను పోలీసులు పట్టుకున్నారు. ఇద్దరు డ్రగ్స్ పెడ్లర్లతో పాటు ఓ ఆఫ్రికన్ ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు.  ఈ ఏడాది మే 8వ తేదీన అంతర్జాతీయ డ్రగ్ పెడ్లర్ ఆశిష్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. 

Latest Videos

undefined

ఈ నెల 19న సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో  గంజాయి, కొకైన్‌ను పోలీసులు పట్టుకున్నారు. 18 కేసుల్లో 61 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  నిందితుల నుండి 1,982 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. రూ.6 కోట్ల విలువైన మత్తు పదార్థాలను పోలీసులు సీజ్ చేశారు. ఆంధ్రా, ఒడిశా నుంచి మహారాష్ట్ర, కర్ణాటకకు ఈ ముఠా గంజాయి సరఫరా చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.పత్తి విత్తనాల మాటున  మత్తు పదార్ధాలను సరఫరా చేస్తున్నారని పోలీసులు గుర్తించారు.

ఏపీ రాష్ట్రానికి చెందిన ఇద్దరు టెక్కీలు  డ్రగ్స్ ను తరలిస్తూ యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ లో రాచకొండ పోలీసులకు  ఈ ఏడాది మే 31న పట్టుబడ్డారు.  . ఏపీలోని కాకినాడ జిల్లా పెదపూడి మండలం గొల్లల మామిడాడకు చెందిన వట్టూరి సూర్య సంపత్,  రాజమహేంద్రవరంలోని మోరంపూడి సాయినగర్ కు చెందిన తీగల దీపక్ ఫణీంద్ర  సాఫ్ట్ వేర్ ఇంజనీర్లు.  వీరిద్దరూ డ్రగ్స్ అలవాటు పడ్డారని పోలీసులు చెప్పారు.  గోవా నుండి డ్రగ్స్ ను తరలిస్తూ పోలీులకు పట్టుబడ్డారు. 

also read:కడుపులో దాచి డ్రగ్స్ సరఫరా.. చెన్నై ఎయిర్‌పోర్టులో రూ. 9 కోట్ల విలువైన హెరాయిన్ సీజ్

హైద్రాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు వద్ద లారీ ఎక్కి రాజమండ్రికి  బయలుదేరారు. ఇద్దరు టెక్కీలు.ఈ విషయమై పక్కా సమాచారం అందుకున్న చౌటుప్పల్ పోలీసులు వీరిని అరెస్ట్ చేశారు. నిందితుల నుండి డ్రగ్స్, ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

click me!