నా బయోడేటా, వ్యాపారాల గురించి ఈడీ ఆరా: ఆరు గంటల పాటు పైలెట్ రోహిత్ రెడ్డి విచారణ

By narsimha lodeFirst Published Dec 19, 2022, 9:31 PM IST
Highlights

తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డిని  ఈడీ అధికారులు ఆరు గంటలపాటు విచారించారు.ఇవాళ  మధ్యాహ్నం ఆరు గంటలకు  రోహిత్ రెడ్డి  ఈడీ విచారణకు  హాజరయ్యారు. 
 

హైదరాబాద్:తన బయోడేటా , వ్యాపార  వివరాల గురించి  ఈడీ అధికారులు ప్రశ్నించారని  తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి  చెప్పారు. రేపు మరోసారి విచారణకు రావాలని ఈడీ అధికారులు కోరారని  ఎమ్మెల్యే తెలిపారు.తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డిని  ఆరు గంటల పాటు  ఈడీ అధికారులు విచారించారు. సోమవారం నాడు మధ్యాహ్నం  మూడున్నర గంటల సమయంలో  రోహిత్ రెడ్డి విచారణకు  హాజరయ్యారు. ఈడీ అధికారుల  విచారణ పూర్తైన తర్వాత  సోమవారంనాడు  రాత్రి  ఆయన మీడియాతో మాట్లాడారు.ఆరు గంటల పాటు  తనను  ఈడీ అధికారులు  వ్యక్తిగత వివరాలు అడిగారని ఎమ్మెల్యే చెప్పారు.

also read:ఏ కేసులో విచారణకు పిలిచారో తెలియదు: తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి

ఏ కేసుకు సంబంధించి తనను  విచారణకు పిలిచారని తాను పదే పదే  అడిగినా కూడా  ఈడీ అధికారుల నుండి  సమాధానం లేదన్నారు. తన వ్యాపార లావాదేవీలతో పాటు  కుటుంబసభ్యుల  వివరాలను కూడా  ఈడీ అదికారులు తెలుసుకున్నారని  రోహిత్ రెడ్డి  తెలిపారు. ఈడీ అధికారులు అడిగిన ప్రతి ప్రశ్నకు తాను సమాధానం చెప్పానన్నారు.  ఏ కేసు గురించి తనను విచారిస్తున్నారో  చెప్పలేదన్నారు.  చట్టాన్ని గౌరవించే వ్యక్తిగానే తాను ఈడీ విచారణకు హాజరైనట్టుగా  పైలెట్ రోహిత్ రెడ్డి చెప్పారు. రేపు మళ్లీ తనను విచారణకు రావాలని కోరారన్నారు. ఏ కేసు గురించి  ప్రశ్నిస్తున్నారో తనకే అర్ధం కాలేదని ఎమ్మెల్యే  రోహిత్ రెడ్డి  చెప్పారు. ఎలాంటి అక్రమ లావాదేవీలు, మనీలాండరింగ్  గురించి  ప్రశ్నించలేదన్నారు. ఏ కేసు గురించి తనను ప్రశ్నిస్తున్నారో  రేపైనా తెలుస్తుందో  లేదోనని రోహిత్ రెడ్డి  చెప్పారు. ఇది ఎక్కడి  ఈడీ విచారణో తనకు అర్ధం కావడం లేదన్నారు.  ఈడీ అధికారులు అడిగే ప్రతి ప్రశ్నకు తాను సమాధానం చెబుతానని ఎమ్మెల్యే  తెలిపారు

ఈ నెల  16వ తేదీన తాండూరు ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. అయితే తనకు సమయం కావాలని రోహిత్ రెడ్డి  ఈడీ అధికారులకు  తన  పీఏ ద్వారా సమాచారం పంపారు.  రోహిత్ రెడ్డి వినతిని  ఈడీ అధికారులు తిరస్కరించారు. దీంతో ఇవాళ మధ్యాహ్నం  రోహిత్ రెడ్డి  విచారణకు హాజరయ్యారు.మొయినాబాద్ ఫాం హౌస్ లో  ముగ్గురు నిందితులను అరెస్ట్ చేయించడంలో పైలెట్ రోహిత్ రెడ్డి  కీలకంగా  వ్యవహరించారు. అందుకే రోహిత్ రెడ్డిపై బీజేపీ టార్గెట్  చేసిందని  బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ఈ ఆరోపణలను బీజేపీ నేతలు తోసిపుచ్చుతున్నారు. మొయినాబాద్ ఫాం హౌస్ లో  ఎమ్మెల్యేలను ప్రలోభాలకు గురి చేసిన ముగ్గురితో తమ పార్టీకి సంబంధం లేదని బీజేపీ నేతలు చెబుతున్నారు.


 

click me!