కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పాదయాత్ర మంగళవారంనాడు హైద్రాబాద్ నగరంలోకి ప్రవేశించింది. ఇవాళ సాయంత్రం నెక్లెస్ రోడ్డు వద్ద రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు.
హైదరాబాద్: రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర మంగళవారంనాడు హైద్రాబాద్ నగరంలోకి ప్రవేశించింది. ఇవాళ ఉదయం షాద్ నగర్ కు సమీపంలోని తొండుపల్లి నుండి రాహుల్ గాంధీ తన పాదయాత్రను ప్రారంభించారు.శంషాబాద్ నుండి ఆరాంఘర్ వరకు రాహుల్ గాంధీ పాదయాత్ర నిర్వహించారు. ఆరాంఘర్ వద్ద రాహుల్ గాంధీ టీ బ్రేక్ కోసం పాదయాత్రకు కాసేపు విరామం ఇచ్చారు.ఆరాంఘర్ వద్ద కరాటే విద్యార్ధులు రాహుల్ గాంధీని కలుసుకుకున్నారు.
రోడ్డుపైనే కరాటే విద్యార్ధులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించారు. కరాటే విద్యార్ధులను రాహుల్ గాంధీ అభినందించారు.బహదూర్ పుర వద్ద రాహుల్ గాంధీ లంచ్ బ్రేక్ కోసం పాదయాత్రకు విరామం ఇవ్వనున్నారు.లంబ్ బ్రేక్ తర్వాత చార్మినార్ ,పురానాపూల్ నుండి యాత్ర ముందుకు సాగుతుంది. అఫ్జల్ గంజ్ ,మొజాంజాహి మార్కెట్ ,గాంధీ భవన్ , పోలీస్ కంట్రోల్ రూమ్ ,ఐమాక్స్ మీదుగా రాహుల్ గాంధీ పాదయాత్ర సాగుతుంది. చార్మినార్ వద్ద రాహుల్ గాంధీ జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. సాయంత్రం నెక్లెస్ రోడ్డులోని ఇందిరాగాంధీ విగ్రహం వద్ద రాహుల్ గాంధీ కార్నర్ మీటింగ్ నిర్వహించనున్నారు. ఇవాళ రాత్రికి తాడ్ బండ్ వద్ద రాహుల్ గాంధీ బస చేయనున్నారు. తాడ్ బండ్ నుండి రాహుల్ గాంధీ పాదయాత్రను రేపు ఉదయం ప్రారంభించనున్నారు.రాహుల్ గాంధీ పాదయాత్రలో కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే ఇవాళ పాల్గొంటారు.
ఈ నెల23న భారత్ జోడో యాత్ర కర్ణాటక నుండి తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించింది.తెలఅంగాణ రాష్ట్రంలో భారత్ జోడో యాత్ర ఏడోరోజుకు చేరుకుంది. ఈ నెల 23న పాదయాత్ర తెలంగాణలోకి ప్రవేఇించినప్పటికీ దీపావళిని పురస్కరించుకొని యాత్రకు కాంగ్రెస్ అగ్రనేత బ్రేక్ ఇచ్చారు. ఈ నెల 27వ తేదీ నుండి తిరిగి పున: ప్రారంభమైంది.తెలంగాణ రాష్ట్రం నుండి రాహుల్ గాంధీ పాదయాత్ర మహారాష్ట్రలోకి ప్రవేశించనుంది. రాష్ట్రంలోని మరోవారం రోజుల పాటు యాత్ర సాగనుంది.