హైదరాబాద్ నగరంలో నానాటికీ పెరిగిపోతున్న డ్రగ్స్ కల్చర్‌పై ఆందోళన వ్యక్తం చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్. నగరంలో కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందని.. ఫార్మసీ స్టోర్‌లలో డాక్టర్ చిట్టీ లేకుండా డ్రగ్స్ ఇవ్వకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ కల్చర్‌తో యువత పెడ దారి పడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ . ఆదివారం అసెంబ్లీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైట్‌నర్, కాఫ్ సిరప్‌తో పాటు ఇతర డ్రగ్స్‌కు బానిసై వీటితో మత్తుకు అలవాటు పడుతున్నారని ఇది చాలా సీరియస్ అంశమని , సర్కార్ దీనిపై దృష్టి పెట్టాలని కోరారు అక్బరుద్దీన్. నగరంలో కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యాపారం జరుగుతోందని.. ఫార్మసీ స్టోర్‌లలో డాక్టర్ చిట్టీ లేకుండా డ్రగ్స్ ఇవ్వకుండా చూడాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
బడ్జెట్ సమావేశాలు 20 రోజులు నిర్వహించాల్సిందని అక్బరుద్దీన్ అన్నారు. 25 అంశాలపై స్వల్పకాలిక చర్చ చేయొచ్చని గుర్తించామని .. గతేడాది కోవిడ్ కారణంగా అసెంబ్లీ సమావేశాలను కుదించారని అక్బరుద్దీన్ వ్యాఖ్యానించారు. 2014-18 మధ్య 126 రోజులు అసెంబ్లీ సమావేశాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. 2018 డిసెంబర్ నుంచి 67 రోజులు మాత్రమే జరిగాయని అక్బరుద్దీన్ తెలిపారు.
ALso Read: పాతబస్తీలో కరెంట్ చోరీ జరుగుతోందంట.. మేం ఊరుకుంటామా : అక్బరుద్దీన్ సంచలన వ్యాఖ్యలు
ఇదిలావుండగా .. కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లును ఆమోదించాలని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌కి అక్బరుద్దీన్ ఓవైసీ రెండ్రోజుల క్రితం విజ్ఞప్తి చేశారు. బిల్లు క్లియర్ కాక వర్సిటీల్లో ఖాళీల భర్తీ నిలిచిపోయింది. 5 నెలలుగా కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డు బిల్లు పెండింగ్‌లో వుంది. వెంటనే బిల్లును ఆమోదించాలని గవర్నర్‌ను కోరారు అక్బరుద్దీన్.
ఇక.. పాతబస్తీపై కొందరు విమర్శలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పాతబస్తీలో కరెంట్ చోరీ జరుగుతోందని విమర్శిస్తున్నారని.. అలా జరిగితే తామే అడ్డుకుంటామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. తెలంగాణ విద్యుత్ శాఖ మంత్రి దీనిపై వివరణ ఇవ్వాలని ఒవైసీ డిమాండ్ చేశారు. విద్యుత్ ఏసీడీ ఛార్జీల వసూలుపై ప్రభుత్వం ఆలోచించాలని ఆయన పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన విధంగా నిరుద్యోగ భృతి ఇవ్వాలని అక్బరుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు.