పాప్ అప్ కమ్ డ్యూయల్ సెల్ఫీ కెమెరా వీవో వీ17 ప్రో స్పెషలైజేషన్

By telugu team  |  First Published Sep 21, 2019, 12:06 PM IST

చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ వివో.. భారత విపణిలోకి పాప్ఆప్ సెల్ఫీ కెమెరాను విడుదల చేసింది. దీని ధర రూ.29,990తో మొదలవుతుంది.


చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘వివో’ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో మరో సంచలనానికి తెరతీసింది. ఏకంగా రెండు సెల్ఫీ కెమెరాలతో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. అది కూడా పాప్ అప్ సెల్ఫీ కెమెరా. వివో కొత్తగా రిలీజ్ చేసిన వివో ‘వీ17 ప్రో’ స్మార్ట్‌ఫోన్‌లోని అద్భుతమైన ఫీచర్ ఇది. ఇందులో ఆరు కెమెరాలు ఉన్నాయి. 

వివో వీ సిరీస్‌లోని వివో వీ17 ప్రో గురించి సంస్థ యాజమాన్యం కొంతకాలంగా వినియోగదారులను ఊరిస్తోంది. భారత విపణిలో వివో వీ17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. రెండు సెల్ఫీ కెమెరాలు, నాలుగు రియర్ కెమెరాలు ఉండటం ఈ ఫోన్ ప్రత్యేకత. 

Latest Videos

48 మెగాపిక్సెల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. అంటే 48 మెగా పిక్సెల్ సోనీఐఎంఎక్స్ 582 సెన్సర్లతో ఏర్పాటు కాగా, 13 మెగా పిక్సెల్స్ టెలిఫోటోలెన్స్, 8 మెగా పిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా, పోర్ట్రైయిట్ ఫొటోస్ కోసం 2 మెగా పిక్సెల్ డెప్త్ సెన్సర్లు ఉపయోగించారు. 

వివో వీ17 ప్రో స్మార్ట్‌ఫోన్‌ సేల్ ఫ్లిప్‌కార్ట్‌లో సెప్టెంబర్ 27న ప్రారంభం అవుతుంది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ప్రీ-బుకింగ్ ప్రారంభమైంది. అమెజాన్, పేటీఎం మాల్, టాటా క్లిక్ వెబ్ సైట్లలోనూ ఈ ఫోన్ల విక్రయాలు మొదలు కానున్నాయి. 

ప్రారంభ ఆఫర్ కింద హెచ్ డీఎఫ్ సీ కార్డుతో కొనుగోలు చేసే వారికి 10 శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అందిస్తున్నారు. వీటితోపాటు ఉచిత స్క్రీన్ రీప్లేస్ మెంట్ వసతిని కల్పిస్తున్నారు.

వివో వీ17 ప్రో ఫోన్ 6.4 అంగుళాల సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే కలిగి ఉంటుంది. ఇంకా 8 జీబీ ర్యామ్ విత్ 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ సామర్థ్యం ఉంటుంది. స్నాప్‌డ్రాగన్ 675 ప్రాసెసర్‌తోపాటు 48+13+8+2 మెగా పిక్సెల్ రియర్ కెమెరా అమర్చారు. 

ఇంకా 32+8 మెగాపిక్సెల్‌తో ఫ్రంట్ కెమెరా ఫీచర్ ఏర్పాటు చేశారు. బ్యాకప్‌లో గొరిల్లా గ్లాస్ 6 ప్రొటెక్షన్ లభిస్తోంది.  ఇందులో ఇంకా ఫింగర్ ఫ్రింట్ స్కానర్, డార్క్ మోడ్ ఫీచర్లు ఉన్నాయి. సెల్పీ కెమెరాలో నైట్ మోడ్, మూన్ లైట్ మోడ్ ఉన్నాయి. ఈ ఫోన్‌లో ఫేస్ అన్ లాక్ ఫీచర్ లేకపోవడం గమనార్హం. 

4,100 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ దీని సొంతం. ఆండ్రాయిడ్ 9 + ఫన్ టచ్ ఓఎస్ 9.1 సిస్టం ఆధారంగా ఈ ఫోన్ పని చేస్తుంది. మిడ్‌నైట్ ఓషియన్, గ్లేసియర్ ఐస్ కలర్స్‌లో లభించే ఈ ఫోన్ రూ.29,990గా నిర్ణయించారు. 


 

click me!