వివో వై35ఎం మిడ్ రేంజ్ బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ ధర 1699 యువాన్లు అంటే సుమారు రూ.20 వేలు. Vivo Y35m డౌన్ గోల్డ్, ఐస్ క్లౌడ్ బ్లూ ఇంకా అబ్సిడియన్ బ్లాక్ రంగులలో వస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫోన్ లిస్ట్ చేయబడింది.
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వివో వై సిరీస్ కింద మరో కొత్త స్మార్ట్‌ఫోన్ వివో వై35ఎంను విడుదల చేసింది. అయితే ఈ ఫోన్‌ని ప్రస్తుతం దేశీయ మార్కెట్లోకి ప్రవేశపెట్టారు. ఫోన్‌లో 6.5-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ డిస్‌ప్లే, ప్రాసెసింగ్ కోసం డైమెన్సిటీ 700 చిప్‌సెట్ సపోర్ట్ ఉంది. వివో వై35ఎం డ్యూయల్ రియర్ కెమెరా సెటప్, పెద్ద 5000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ ఇతర స్పెసిఫికేషన్లు, ధర గురించి తెలుసుకుందాం...
వివో వై35ఎం ధర
వివో వై35ఎం మిడ్ రేంజ్ బడ్జెట్‌లో ప్రవేశపెట్టారు. ఈ ఫోన్ ధర 1699 యువాన్లు అంటే సుమారు రూ.20 వేలు. Vivo Y35m డౌన్ గోల్డ్, ఐస్ క్లౌడ్ బ్లూ ఇంకా అబ్సిడియన్ బ్లాక్ రంగులలో వస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫోన్ లిస్ట్ చేయబడింది.
undefined
స్పెసిఫికేషన్లు
వివో కొత్త ఫోన్ 6.51-అంగుళాల హెచ్‌డి ప్లస్ ఐపిఎస్ ఎల్‌సిడి డిస్‌ప్లే ఉంది, (720x1600 పిక్సెల్‌లు) రిజల్యూషన్, 60 Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది. ఫోన్‌లో ప్రాసెసింగ్ కోసం డైమెన్సిటీ 700 చిప్‌సెట్ ఇచ్చారు. ఈ ఫోన్ 8జిబి వరకు ర్యామ్, 128జిబి వరకు స్టోరేజ్ పొందుతుంది. మైక్రో ఎస్‌డి కార్డ్ సహాయంతో స్టోరేజ్ పెంచుకొవచ్చు. Android 13 ఆధారిత OriginOS Ocean ఫోన్‌లో ఆపరేటింగ్ సిస్టమ్‌గా వస్తుంది.
కెమెరా అండ్ బ్యాటరీ
Vivo Y35M కెమెరా సపోర్ట్ గురించి మాట్లాడితే డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ఫోన్‌లో 13 మెగాపిక్సెల్‌ల ప్రైమరీ కెమెరా ఇంకా సెకండరీ 2 మెగాపిక్సెల్ డెప్త్ ఉన్నాయి. వెనుక కెమెరాతో LED ఫ్లాష్ కూడా ఉంది. సెల్ఫీ అండ్ వీడియో కాల్స్ కోసం ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
వివో Y35M 15W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ తో 5,000mAh బ్యాటరీ ఉంది. ఫోన్‌లో కనెక్టివిటీ కోసం 5G, Wi-Fi, బ్లూటూత్ 5.2, GPS, యూఎస్‌బి టైప్-C పోర్ట్ అండ్ 3.5ఎంఎం హెడ్‌ఫోన్ జాక్‌లకు సపోర్ట్ ఉంది. ఫోన్‌లో సెక్యూరిటి కోసం సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఇచ్చారు.