రెడ్ మీకి పోటీగా పోకో కొత్త బడ్జెట్ ఫోన్.. తక్కువ ధర ఫోన్ కోసం చూసే వారికి బెస్ట్ ఆప్షన్..

By asianet news telugu  |  First Published Dec 29, 2022, 1:31 PM IST

పోకో సి50 అనేది  ఒక ఎంట్రీ లెవల్ ఫోన్, ఈ ఫోన్ రెడ్ మీ ఎస్1+ కి పోటీగా వస్తుంది. పోకో సి50 మోడల్ నంబర్ 220733SPI అండ్ కోడ్ పేరు స్నోతో గూగుల్ ప్లే కన్సోల్‌లో కూడా లిస్ట్  చేయబడింది.


చైనీస్ కంపెనీ పోకో త్వరలో ఇండియాలో పోకో సి50 అనే కొత్త ఫోన్‌ను లాంచ్ చేయబోతోంది. అయితే కంపెనీ ప్రస్తుతం పోకో సి50 లాంచ్ తేదీ గురించి ఎటువంటి సమాచారం ఇవ్వలేదు కానీ  పోకో సి50 టీజర్‌ను సోషల్ మీడియాలో విడుదల చేసింది. టీజర్‌ను చూస్తుంటే పోకో సి50 3 జనవరి  2023న భారతదేశంలో లాంచ్ అవుతుందని ఊహిస్తున్నారు. 

పోకో సి50 అనేది  ఒక ఎంట్రీ లెవల్ ఫోన్, ఈ ఫోన్ రెడ్ మీ ఎస్1+ కి పోటీగా వస్తుంది. పోకో సి50 మోడల్ నంబర్ 220733SPI అండ్ కోడ్ పేరు స్నోతో గూగుల్ ప్లే కన్సోల్‌లో కూడా లిస్ట్  చేయబడింది. పోకో సి50 కొన్ని నెలల క్రితం మీడియా టెక్ హీలియో ఏ22తో భారతదేశంలో ప్రారంభించిన రెడ్ మీ ఏ1+ రీబ్రాండెడ్ వెర్షన్ అని చెబుతున్నారు.

Latest Videos

undefined

గిజ్ చైనా గూగుల్ ప్లే కన్సోల్ స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది, దీనిలో పోకో సి50 మోడల్ నంబర్ చూడవచ్చు. పోకో సి50 ఫీచర్లు కూడా రెడ్ మీ A1+ తరహాలోనే ఉంటాయని చెబుతున్నారు. రెడ్ మీ A1+ ఇండియాలో ఈ సంవత్సరం అక్టోబర్‌లో రూ. 6,999 ధరతో పరిచయం చేశారు.

రెడ్ మీ A1+ ఫీచర్ల గురించి చెప్పాలంటే, ఇందులో వాటర్‌డ్రాప్ నాచ్ డిస్‌ప్లే ఉంది. ఈ ఫోన్‌లో మీడియా టెక్ హీలియో A22 ప్రాసెసర్ అందించారు. ఇంకా మూడు కలర్ వేరియంట్‌లలో పరిచయం చేసారు. రెడ్ మీ A1+ 120Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో 6.52-అంగుళాల హెచ్‌డి+ డిస్‌ప్లే ఉంది. ఫోన్ ఆండ్రాయిడ్ 12, 8-మెగాపిక్సెల్ డ్యూయల్ రియర్ కెమెరా ఇచ్చారు.  ఇంకా 5000mAh బ్యాటరీ  ఉంది.

click me!