దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్ మేజర్ శామ్ సంగ్ భారత విపణిలోకి సరికొత్త హంగులతో 64 మెగా పిక్సెల్ కెమెరాతో గెలాక్సీ ఎ70ఎస్ ఫోన్‌ను ఆవిష్కరించింది. దీని ధర రూ.28,999, రూ.30,999గా నిర్ణయించింది.
దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల తయారీ దిగ్గజం శామ్‍సంగ్ తమ వినియోగదారులకు తీపికబురు అందించింది. ప్రత్యేకించి కస్టమర్లను ఆకట్టుకునేందుకు సరికొత్త మోడళ్లలో స్మార్ట్‌ఫోన్లు విడుదల చేస్తూ దూసుకుపోతుంది.
భారత మార్కెట్‌లో 64 మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా ఉన్న శాంసంగ్ గెలాక్సీ ఏ70ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ తెలిపింది. 6జీబీ విత్ 128జీబీ వేరియంట్ శామ్‌సంగ్ గెలాక్సీ ఏ70ఎస్ ఫోన్ ప్రారంభ ధర రూ. 28,999 నుంచి మొదలవుతుంది. 8 జీబీ విత్ 128 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.30,999గా నిర్ణయించారు.
undefined
శామ్‌సంగ్ ఆన్‌లైన్, శామ్‌సంగ్ ఒపేరా హౌస్, ఈ-రిటైలర్స్ నుంచి ఫోన్లను కొనుగోలు చేయవచ్చు. లాంచింగ్ ఆఫర్ల కింద జియో, ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా వినియోగదారులకు డేటా ఆఫర్లు అందుబాటులో ఉంచారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 9పై ఓఎస్ వన్ యూఐతో పని చేస్తుంది. ఇందులో తొలిసారి 64 మెగా పిక్సెల్ కెమెరాను తీసుకువచ్చింది.
దీంతోపాటు 8 ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 5 ఎంపీ కెమెరాను అఅమర్చారు. మరోవైపు ముందు 32 ఎంపీ సెల్ఫీ కెమెరాను అందుబాటులోకి తెచ్చారు. 128 జీబీ ఇంటర్నల్ స్టోరేజీ సామర్థ్యంతో వస్తున్న ఈ ఫోన్ మెమొరీని మైక్రో ఎస్డీ కార్డు సాయంతో 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
శామ్‌సంగ్ గెలాక్సీ ఏ70ఎస్ స్మార్ట్‌ఫోన్‌ను ప్రిజం క్రష్ రెడ్, ప్రిజం క్రష్ బ్లాక్, ప్రిజం క్రష్ వైట్ రంగుల్లో రూపొందించారు. ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 675 ఎస్వోసీ, 32 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా, 4,500 ఎంఏహెచ్ సామర్థ్యం గల బ్యాటరీ, ఫ్రింగర్‌ప్రింట్ సెన్సార్ స్పోర్ట్స్ స్క్రీన్, వాటర్ డ్రాప్-స్టైల్, 6.7 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 25వోల్టేజీ ఫాస్ట్ ఛార్జింగ్ ఫీచర్లు అందుబాటులో ఉన్నాయి.