నెలకో కొత్త స్మార్ట్‌ఫోన్.. డబుల్ డిజిట్‌పైనే శామ్‌సంగ్ ఫోకస్

By ramya N  |  First Published Mar 1, 2019, 4:15 PM IST

దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం శామ్ సంగ్ బడ్జెట్ ఫోన్ల తయారీపైనే ఎక్కువగా కేంద్రీకరిస్తోంది. ఇంతకుముందు ఎం సిరీస్ లో మూడు రకాల ఫోన్లు ఆవిష్కరించిన శామ్ సంగ్ తాజాగా ఏ సిరీస్ లో మరో మూడు ఫోన్లను ఆవిష్కరించింది. వాటి ధరలు కూడా బడ్జెట్ లోనే ఉండటం ఆసక్తికర పరిణామం. శనివారం నుంచి ఈ ఫోన్లు అందుబాటులో ఉంటాయి. 


దక్షిణ కొరియా మొబైల్‌ ఫోన్ల కంపెనీ శామ్‌సంగ్‌.. గెలాక్సీ ‘ఎ’ సీరీస్‌లో మరో మూడు కొత్త ఫోన్లను తెచ్చింది. గెలాక్సీ ఏ50, ఏ30, ఏ10 అనే పేర్లతో రూపొందించిన ఈ ఫోన్లను శామ్‌సంగ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆదిత్య బబ్బర్ మార్కెట్లోకి విడుదల చేశారు. 

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ శ్రేణిలో వచ్చిన ఎ50, ఎ30, ఎ10 మొబైల్‌ ఫోన్లు శనివారం నుంచి తెలుగు రాష్ట్రాల్లో అందుబాటులోకి రానున్నాయి. ఈ ఏడాది ప్రథమార్థంలో నెలకొక ఫోన్ విడుదల చేస్తామని తెలిపారు. ఈ ఏడాది డబుల్ డిజిట్ డెవలప్మెంట్ సాధించాలన్నదే తమ లక్ష్యమన్నారు.
శామ్‌సంగ్ ఏ50, ఏ30 ఫోన్లలో 6.4 అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ ప్లస్‌ సూపర్‌ అమో ఎల్‌ఈడీ, ఇన్‌ఫినిటీ-యూ డిస్‌ప్లే, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ ఉన్నాయి. ఏ50 మోడల్ ఫోన్‌లో రేర్ 25 ఎంపీ కెమెరా, బ్యాక్ 25ఎంపీ+5ఎంపీ+8ఎంపీ కెమెరాలు ఉండగా.. ఏ30లో ముందు 16 ఎంపీ, బ్యాక్ 16 ఎంపీ+5ఎంపీ కెమెరాలు ఉన్నాయి. 

Latest Videos

undefined

శామ్‌సంగ్ ఏ50 మోడల్ ఫోన్‌లో 6 జీబీ రామ్‌ విత్ 64జీబీ ఇంటర్నల్‌ మెమరీ కలిగిన ఫోన్‌ ధర రూ.22,990 కాగా, 4 జీబీ విత్ రామ్ 64జీబీ రామ్ స్టోరేజీ సామర్థ్యం గల వేరియంట్‌ ఫోన్ ధర రూ.19,990గా ఉంది.
 
శామ్‌సంగ్ఏ30 ధర రూ.16,990గా నిర్ణయించింది. 6.2 అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 13 ఎంపీ బ్యాక్ కెమెరా, 5ఎంపీ రేర్ కెమెరా, 3400 ఎంఏహెచ్‌ సామర్థ్యంతో కూడిన బ్యాటరీ కలిగిన ఏ10 ఫోన్ ధర రూ.8,490గా ఉంది. 

ఈ ఫోన్లు మార్చి 2వ తేదీ నుంచి అందుబాటులో ఉంటాయని శామ్‌సంగ్ ఇండియా జనరల్ మేనేజర్ ఆదిత్య బబ్బర్ తెలిపారు. మిలీనియల్స్‌ అభిరుచులు, అలవాట్లను దృష్టిలో ఉంచుకుని ఈ కొత్త ఫోన్లను విడుదల చేశామన్నారు.

స్మార్ట్‌ఫోన్ల అమ్మకాల పరంగా ఈ ఏడాదిలో రెండంకెల వృద్ధిని ఆశిస్తున్నామని చెప్పారు. శామ్‌సంగ్‌ ఫోన్ల అమ్మకాల్లో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ మార్కెట్ల వాటా కీలకంగా ఉందని తెలిపారు.
 

click me!