యువత మెచ్చే ఫీచర్లు:‘బడ్జెట్’లో రెడ్‌మీ నోట్ 7& 7 ప్రో

By ramya N  |  First Published Mar 1, 2019, 12:32 PM IST

ఇప్పటికే భారత మార్కెట్లో దూసుకెళ్తున్న చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం ‘షియోమీ’, దాని అనుబంధ సంస్థ రెడ్ మీ మరో సంచలనానికి కేంద్రంగా మారాయి. రెడ్ మీ నోట్ 7, రెడ్ మీ నోట్ 7 ప్రో పేరిట నూతన మోడల్ స్మార్ట్ ఫోన్లను మార్కెట్ల్లోకి విడుదల చేశాయి. అంతేకాదు యువతను ఆకర్షించే అదనపు అత్యాధునిక ఫీచర్లతోపాటు అందరికీ అందుబాటులో ఉన్న బడ్జెట్ ధరలోనే విక్రయించాలని షియోమీ తలపెట్టింది. రెడ్ మీ నోట్ 7 ఫోన్ ధర రూ.9999తో మొదలవుతుంది. 


చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం షియోమీ.. యువత మెచ్చే సరికొత్త ఫీచర్లతోపాటు బడ్జెట్‌ ధరలో మరో రెండు ఫోన్లు ఇక అధికారికం. భారత విపణిలో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న మొబైల్‌ కంపెనీ షియోమీ నుంచి విడుదలయ్యే కొత్త ఫోన్ల కోసం కొద్ది రోజులుగా టెక్‌ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న రెడ్‌ మీ నోట్‌7, నోట్ ‌7 ప్రో మోడల్ ఫోన్లను తొలిసారిగా భారత్‌లో విడుదల చేసింది. ఇప్పటికే చైనా మార్కెట్లో మిలియన్‌ అమ్మకాలతో రెడ్‌మి నోట్‌ 7 దూసుకుపోతున్నది. ప్రారంభ ధర అనూహ్యంగా రూ.9999గా ప్రకటించడం ఆసక్తికర పరిణామం.

నోట్ 7 ప్రో ధరలిలా
న్యూఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో షియోమీ భారత్ ఎండీ మనుకుమార్‌ జైన్‌ ఈ ఫోన్ల ఫీచర్లను, ధరలను తెలిపారు. రెడ్‌మీ నోట్‌ 7 ప్రో 4 జీబీ ర్యామ్‌ విత్ 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ ఉన్న వేరియంట్‌ ధరను రూ.13,999, 6జీబీ ర్యామ్‌ విత్ 64జీబీ స్టోరేజీ మొబైల్‌ ధరను రూ.16,999గా ప్రకటించారు.

Latest Videos

13 నుంచి వైబ్ సైట్లలో నోట్ 7 ప్రో లభ్యం
ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ వెబ్‌సైట్లతో పాటు, ఎంఐ హోమ్‌ స్టోర్‌లోనూ రెడ్ మీ నోట్ 7 ప్రో ఫోన్ అందుబాటులోకి రానుంది. నెఫ్ట్యూన్‌ బ్లూ, నెబులా రెడ్‌, స్పేస్‌ బ్లాక్‌ రంగుల్లో ఇది లభ్యం కానున్నది. ఈ ఫోన్‌ కొనుగోలు చేసిన వారికి ఎయిర్‌టెల్‌ ప్రత్యేక ఆఫర్‌ను అందించనుంది. 1,120 జీబీ 4జీ డేటాను ఉచితంగా అందించడంతో పాటు, ఎయిర్‌టెల్‌ డిజిటల్‌ టీవీ ఉచితంగా వీక్షించవచ్చు.

విపణిలోకి రెడ్ మీ నోట్ 7 కూడా
ఇక మరో ఫోన్‌ రెడ్‌మీ 7 ఫోన్‌ను కూడా మనుకుమార్‌ జైన్‌ విడుదల చేశారు. 3జీబీ ర్యామ్‌ విత్ 32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ మొబైల్‌ ధర రూ.9,999, 4జీ ర్యామ్‌ విత్ 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్‌ కలిగిన మొబైల్‌ ధరను రూ.11,999గా నిర్ణయించారు. ఈ నెల 6వ తేదీ నుంచి రెడ్ మీ 7 ఫోన్‌ను ఆసక్తి గల వినియోగ దారులు కొనుగోలు చేయొచ్చు. అయితే రెడ్‌మీ నోట్‌ 7లో  48 మెగా పిక్సెల్‌ భారీ కెమెరాకు బదులుగా  ఇండియాలో కేవలం డ్యుయల్‌ రియర్‌ కెమెరాను అమర్చింది.

ఇవీ రెడ్‌మీ నోట్‌7 ప్రో ప్రత్యేకతలు
6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లేతోపాటు గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌ ఉంటుంది.  స్నాప్‌ డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌ను అమర్చడంతోపాటు 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉంటుంది. బ్యాక్ 48 ఎంపీ  ప్లస్ 5 మెగా పిక్సెల్‌ సోనీ ఐఎంఎక్స్‌586 కెమెరాలకు అదనంగా ముందు 13 ఎంపీ కెమెరా అమర్చారు. ఇది రెండు వేరియంట్లలో లభ్యం కానున్నది.  4జీబీ రామ్ విత్ 64జీబీ నిల్వ సామర్థ్యం,  6జీబీ రామ్ విత్ 128 జీబీ రామ్ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం ఉంటుంది. టైప్‌ సీ పోర్ట్‌తోపాటు, క్విక్‌ ఛార్జింగ్‌ 4.0 సపోర్ట్‌ దీని స్పెషాలిటీ. 

రెడ్‌మీ నోట్‌ 7 ప్రత్యేకతలివి
6.3 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ డిస్‌ప్లే, గొరిల్లా గ్లాస్‌ 5 ప్రొటెక్షన్‌తోపాటు స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌ కలిగి ఉంటుంది రెడ్ మీ నోట్ 7 ఫోన్. 3జీబీ రామ్ విత్ 32 జీబీ రామ్ స్టోరేజీ ఫెసిలిటీ, 4 జీబీ‌ రామ్ విత్ 64జీబీ రామ్ స్టోరేజీ సామర్థ్యం గల ఫోన్లు లభిస్తాయి. ఇందులో ఆండ్రాయిడ్ 9పైతోపాటు 12 ప్లస్ 2మెగాపిక్సెల్‌ బ్యాక్ కెమెరా, 13 ఎంపీ రేర్ కెమెరా, 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం, టైప్‌ సి పోర్ట్‌తోపాటు, క్విక్‌ ఛార్జింగ్‌ 4.0 సపోర్ట్‌ వెసులుబాటు రెడ్ మీ 7 నోట్‌లో లభిస్తాయి.

click me!