ప్రముఖ మొబైల్ ఫోన్స్ తయారీ సంస్థ హెచ్ఎండీ గ్లోబల్ తాజాగా నోకియా 3.2 స్మార్ట్ ఫోన్ ని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.8,990గా ప్రకటించింది. ఈ ఫోన్ వినియోగదారులకు ఈ నెల 23వ తేదీ నుంచి అందుబాటులోకి రానుంది.

ఈ ఫోన్ విడుదల సందర్భంగా పలు ఆఫర్లను కూడా ఈ ఫోన్‌పై అందిస్తున్నారు. ఈ ఫోన్‌ను కొన్న కస్టమర్లకు రూ.1వేయి విలువైన గిఫ్ట్ కార్డును ఇస్తారు. దానికి జూన్ 30వ తేదీ వరకు గడువు ఉంటుంది. అలాగే 6 నెలల కాల వ్యవధి గల వన్ టైం స్క్రీన్ రీప్లేస్‌మెంట్ ప్లాన్‌ను ఉచితంగా అందివ్వనున్నారు. దీంతోపాటు ఈ ఫోన్‌పై నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని కూడా అందిస్తున్నారు.
నోకియా 3.2 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు...
6.26 ఇంచ్ హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లే, 720 x 1520 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, స్నాప్‌డ్రాగన్ 429 ప్రాసెసర్, 2/3 జీబీ ర్యామ్, 16/32 జీబీ స్టోరేజ్, 400 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, డ్యుయల్ సిమ్, ఆండ్రాయిడ్ 9.0 పై, 13 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.2, 4000 ఎంఏహెచ్ బ్యాటరీ.