జియో బర్త్ డే ఆఫర్.. మూడునెలలపాటు..ఫ్రీకాల్స్, అన్ లిమిటెడ్ డేటా

By ramya neerukondaFirst Published 12, Sep 2018, 3:00 PM IST
Highlights

జియో సంచలనం మొదలై నేటికి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మరోసారి వినియోగదారుల కోసం ఆఫర్లు తీసుకువచ్చింది.

టెలికాం రంగంలో జియో ఒక సంచలనం. సరిగ్గా ఇదే రోజు జియో టెలికాం రంగంలోకి అడుగుపెట్టింది. అంటే.. జియో సంచలనం మొదలై నేటికి రెండు సంవత్సరాలు పూర్తయ్యింది. ఈ సందర్భంగా మరోసారి వినియోగదారుల కోసం ఆఫర్లు తీసుకువచ్చింది.

రూ.100కే అపరిమిత కాల్స్‌, డేటా ఇవ్వనుంది. ఈ ఆఫర్‌ను మూడు నెలల పాటు వినియోగించుకోవచ్చు. వినియోగదారులకు ఈ ఆఫర్‌ను అందించేందుకు ప్రముఖ ఫైనాన్షియల్‌ టెక్నాలజీ కంపెనీ అయిన ఫోన్‌ పేతో జియో ఒప్పందం కుదుర్చుకుంది.

ఇప్పటికే జియో రూ.399కి 84 రోజుల పాటు రోజుకు 1.5జీబీ హైస్పీడ్‌ డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్‌కు రూ.100 డిస్కౌంట్‌ ఇచ్చి రూ.299కే ఉచిత సేవలను కల్పిస్తోంది. తాజాగా ప్రవేశపెట్టిన కొత్త ఆఫర్‌తో వినియోగదారులు ఉచిత అపరిమిత కాల్స్‌, రోజుకు 100 మెసేజ్‌లు పంపుకొనే అవకాశం ఉంది. రూ.100 డిస్కౌంట్‌ ప్లాన్‌లో రెండు ఆప్షన్లు ఉన్నాయి.

జియో యాప్‌ ద్వారా రీచార్జ్‌‌ చేసుకున్నప్పుడు రూ.50 క్యాష్‌బ్యాక్‌ వౌచర్లు వస్తాయి. ఈ వౌచర్లతో రూ.50 ఇన్‌స్టెంట్‌ డిస్కౌంట్‌ లభిస్తుంది. మై జియో యాప్‌లో ఉన్న ఫోన్‌ పే ఆప్షన్‌ ద్వారా రీచార్జ్ మొత్తం చెల్లిస్తే రూ.50 ఇన్‌స్టెంట్‌ క్యాష్‌బ్యాక్‌ వస్తుంది. ఈ ఆఫర్‌ సెప్టెంబర్‌ 12 నుంచి 21 వరకే లభ్యమవుతుంది. ‌

Last Updated 19, Sep 2018, 9:24 AM IST