ఇన్‌స్టాగ్రామ్ కు షాక్...సంస్థను వీడనున్నట్లు ప్రకటించిన సీఈవో

By Arun Kumar PFirst Published Sep 25, 2018, 4:05 PM IST
Highlights

ఇన్‌స్టాగ్రామ్...నెటిజన్లకు అంత్యంత తొందరగా దగ్గరయిన సోషల్ మీడియా యాప్. కేవలం పోటోలను షేర్ చేస్తూ తమ భావాలను, ఆలోచనలను, ఆనందాన్ని పంచుకోడానికి ఇది యువతకు వేదికగా మారింది. దీంతో ఇది బాగా పాపులర్ అయ్యి ప్రతి ఒక్క స్మార్ట్ ఫోన్ లోకి చేరింది. అంతేకాకుండా సెలబ్రిటీలు కూడా దీంట్లో తమ పోటోలను షేర్ చేస్తూ అభిమానులకు ఆకట్టుకునంటున్నారు. ఇంత సక్సెస్‌‌ఫుల్ గా సాగుతున్న ఈ సంస్థను వీడనున్నట్లు ప్రస్తుత సీఈవో ప్రకటించారు. త్వరలోనే రాజీనామా చేయనున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కు గురిచేశారు.

ఇన్‌స్టాగ్రామ్ వ్యవస్థాపక సభ్యుడు, ప్రస్తుత సీఈవో కెవిన్ సిస్ట్రోమ్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో ఈ సంస్థను వీడనున్నట్లు అతడు వెల్లడించారు. 

2010 లో నెటిజన్లు పోటోలను మాత్రమే షేర్ చేసుకునే సౌలభ్యాన్ని కల్పిస్తూ కెవిన్, మైక్ క్రీగర్ లు ఇన్స్‌స్టాగ్రామ్ ని స్థాపించారు. అయితే అతి తక్కువ కాలంలోనే ఇది నెటిజన్ల మన్ననలు పొందుతూ దూసుకుపోయింది. దీంతో 2012 లో 100కోట్ల డాలర్లకు దీన్ని మరో సోషల్ మీడియా సంస్థ ఫేస్ బుక్ కొనుగోలు చేసింది. అయితే దీనికి సీఈవోగా కెవిన్, టెక్నికల్ ఆఫీసర్ గా క్రీగర్ కొనసాగుతూ వస్తున్నారు. 

అయితే తాజాగా తన పదవికి రాజీనామా చేయనున్నట్లు సీఈవో కెవిన్ ప్రకటించాడు. ఈ రాజీనామా ప్రకటనపై ఫేస్ బుక్ కానీ ఇన్స్‌స్టాగ్రామ్ కానీ ఇంకా అధికారికంగా స్పందించలేదు.     

click me!