జూమంటూ ‘జియో’ దూకుడు.. రుణాలతో టెల్కోల విలవిల

First Published Feb 18, 2019, 11:21 AM IST

ఇటు రిలయన్స్ జియో.. అటు చైనా స్మార్ట్ ఫోన్ల దూకుడుతో దేశీయ టెలికం రంగ స్వరూపమే మారిపోతున్నది. ఒంటరిగా కేవలం 4జీ సేవలతోనే దేశీయ టెలికం సేవల రంగాన్నే మార్చేసిన జియో.. లాభాలార్జించడంతోపాటు ఒంటరిగా కస్టమర్లను ఆకర్షిస్తోంది. మరోవైపు ఇతర సంస్థలను తనలో ఇముడ్చుకున్న భారతీ ఎయిర్ టెల్ ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నా.. వొడాఫోన్ ఐడియా, బీఎస్ఎన్ఎల్, ఆర్ కాం వంటి సంస్థల రుణాల ఊబిలోనే చిక్కుకున్నాయి.

దేశీయ టెలికం రంగం ఏకీకరణ దిశగా వెళ్తున్నది. నెట్‌వర్క్ సంస్థలు విలీనం బాట పడుతుండగా, మొబైల్ తయారీ కంపెనీలు చాలావరకు భారతీయ మార్కెట్‌కు దూరమవుతున్నాయి. ఒకప్పుడు డజనుకు పైగా కనిపించిన మొబైల్ ఫోన్ల ఉత్పాదక సంస్థలు.. ఇప్పుడు సగానికి తగ్గిపోయాయి. అలాగే నెట్‌వర్క్ సంస్థలూ దేశవ్యాప్తంగా నాలుగుకు పడిపోయాయి. టెలికం రంగంలో జియో లాభాలతో మరింత ముందుకు దూసుకెళ్తుండగా, మిగతా సంస్థలు రుణాలతోపాటు ఇతర సమస్యలతో విలవిలలాడుతున్నాయి.
undefined
మారుతున్న మార్కెట్ పరిస్థితులు, పడిపోతున్న ఆదాయం, లాభాల స్థానంలో వచ్చిపడుతున్న నష్టాలు.. టెలికం రంగాన్ని ఏకీకృతం వైపు నడిపిస్తున్నాయి. ఈ క్రమంలో ఆయా సంస్థల్లో పని చేస్తున్న ఉద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతుండగా, విలీనంలో భాగంగా వ్యాపారం ఒక్కటవుతుండటంతో ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తున్నది
undefined
ప్రపంచంలోనే జనాభాపరంగా రెండో అతిపెద్ద దేశమైన భారత్‌లో టెలికం రంగం పరిస్థితి విచిత్రంగా మారింది. భారీగా దేశ, విదేశీ పెట్టుబడులను ఆకట్టుకున్న ఈ రంగం.. ఇప్పుడు కేవలం నాలుగు సంస్థల కనుసన్నల్లో ఉంది మరి. ప్రభుత్వ రంగ సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్, వొడాఫోన్ ఐడియా, భారతీ ఎయిర్‌టెల్, రిలయన్స్ జియోలే అవి.
undefined
ఇంతకుముందు టాటా ఇండికం, డొకొమో, రిలయన్స్ కమ్యూనికేషన్స్, టెలినార్, ఎయిర్‌సెల్, వర్జిన్, వీడియోకాన్ తదితర నెట్‌వర్క్‌లూ ఉండేవి. కానీ క్రమేణా ఇవి కనుమరుగయ్యాయి. 2జీ గేట్ తర్వాత వీటిలో కొన్ని మూతబడితే, మరికొన్నింటిని భారతీ ఎయిర్‌టెల్ హస్తగతం చేసుకున్నది.
undefined
స్పెక్ట్రం అధిక ధరలు కూడా దేశీయ టెలికం రంగాన్ని కన్సాలిడేషన్ మూడ్‌లోకి నెట్టాయని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. 2జీ, 3జీ, 4జీ నెట్‌వర్క్‌ల్లోకి రూపాంతరం చెందగా, చాలా సంస్థలు స్పెక్ట్రం చెల్లింపుల కోసం ఇబ్బందులు పడాల్సి వస్తున్నది.
undefined
ఈ ఇబ్బందులను తట్టుకోలేకే వీడియోకాన్ వంటి సంస్థలు వ్యాపారాన్ని అమ్ముకోగా, ఇప్పుడున్న సంస్థలూ ధరలపై పెదవి విరుస్తున్నాయి. దీనికితోడు లైసెన్సు ఫీజుల భారం కూడా పడుతుండటం టెలికం కంపెనీలను కలవరపాటుకు గురిచేస్తున్నది. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) మినహాయింపునివ్వాలని ఆయా సంస్థలు కేంద్రాన్ని కోరుతున్న విషయం తెలిసిందే.
undefined
ప్రభుత్వ రంగ టెలికం సంస్థలైన భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్‌ఎన్‌ఎల్), మహానగర్ టెలిఫోన్ నిగమ్ లిమిటెడ్ (ఎంటీఎన్‌ఎల్)లు ప్రైవేట్ రంగ సంస్థల పోటీకి తట్టుకోలేకపోతున్నాయి. ఆశించిన స్థాయిలో వ్యాపారం లేక నిర్వహణ భారమై అప్పుల ఊబిలో కూరుకున్నాయి.
undefined
ప్రభుత్వ రంగ సంస్థలు బీఎస్ఎన్ఎల్, ఎంటీఎన్ఎల్ ఉద్యోగులు వేతన సమస్యలను ఎదుర్కొంటుండగా, కస్టమర్లను ఆకర్షించడంలోనూ వెనుకబడుతున్నాయి. అనిల్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ కమ్యూనికేషన్స్ పరిస్థితి చూస్తూనే ఉన్నాం. రూ.46,000 కోట్ల అప్పుల భారాన్ని రిలయన్స్ కమ్యూనికేషన్స్ మోస్తున్నది. ఇంకొన్ని సంస్థలూ నష్టాలను, రుణ భారాన్ని తట్టుకోలేకే టెలికం రంగం నుంచి బయటపడ్డాయి.
undefined
లాభ నష్టాల విషయంలో జియో మినహా మిగతా టెలికం సంస్థలన్నీ నిరాశాజనకంగానే ఉన్నాయి. మెట్రో నగరాలకు పరిమితమైన ఎంటీఎన్‌ఎల్‌ను పక్కనబెడితే బీఎస్‌ఎన్‌ఎల్, ఎయిర్‌టెల్, వొడాఫోన్ ఐడియా సంస్థలు భారీ నష్టాలనే చవిచూశాయి.
undefined
ఇప్పుడిప్పుడే ఎయిర్‌టెల్ కోలుకుంటున్నది. ఈ ఆర్థిక సంవత్సరం (2018-19) మూడో త్రైమాసికం (అక్టోబర్-డిసెంబర్)లో రూ.86 కోట్ల స్వల్ప లాభంతో బయటపడింది. అయితే వొడాఫోన్ ఐడియా మాత్రం ఏకంగా రూ.5,00 4 కోట్ల నష్టాలను ప్రకటించింది. ఇదే సమయంలో జియో రూ.831 కోట్ల లాభాలను ప్రవేశపెట్టింది. అంతకుముందు ఎయిర్‌టెల్ కూడా నష్టాలకే పరిమితమైంది. బీఎస్‌ఎన్‌ఎల్ సైతం నష్టాలతోనే సరిపెట్టుకుంటున్నది.
undefined
ఎక్కువగా భారత మొబైల్ మార్కెట్‌లో షియామీ, వివో, ఒప్పో, హానర్ మొబైల్ ఫోన్లే దర్శనమిస్తున్నాయి. ఇవన్నీ కూడా చైనా మొబైల్ కంపెనీలే. దక్షిణ కొరియా ఎలక్ట్రానిక్స్ దిగ్గజం శామ్‌సంగ్ హవా కూడా తగ్గిపోతున్నది. యాపిల్ సైతం భారతీయ మార్కెట్‌లో తమ ఉనికి కోసం పోరాడుతున్నది.
undefined
భారత టెలికం రంగ స్వరూపాన్ని జియో పూర్తిగా మార్చేసిందంటే ఎంతమాత్రం అతిశయోక్తి కాదు. 2016 సెప్టెంబర్‌లో మొదలైన జియో ధాటికి.. అప్పటిదాకా ఉన్న సంస్థలు బెంబేలెత్తాయి. ఉచిత 4జీ సేవలతో సంచలనం సృష్టించిన ముకేశ్ అంబానీ ఆధ్వర్యంలోని జియో.. ఎయిర్‌టెల్, వొడాఫోన్, ఐడియా తదితర సంస్థల ఆదాయాన్ని ఆవిరి చేసేసింది.
undefined
జియో రంగ ప్రవేశంతో మొబైల్ ఇంటర్నెట్ వాడకం పెరిగిపోగా, డేటా చార్జీలూ భారీగా దిగివచ్చాయి. దీంతో అంతకుముందు భారీ లాభాలను ప్రకటిస్తూ వచ్చిన అగ్రశ్రేణి సంస్థలు.. ఒక్కసారిగా నష్టాల్లోకి జారుకున్నాయి. ఈ క్రమంలోనే టాటా ఇండికం, టెలినార్ తదితర ఎన్నో సంస్థలను ఎయిర్‌టెల్ తనలో ఐక్యం చేసుకుంటూ మార్కెట్‌లో ఆధిపత్యాన్ని నిలుపుకునేందుకు ప్రయత్నిస్తున్నది.
undefined
ఐడియా-వొడాఫోన్‌లు ఒక్కటై దేశంలోనే టెలికం దిగ్గజంగా అవతరించాయి. అయినప్పటికీ కస్టమర్లను జియో ఆకర్షిస్తూనే ఉండగా, ఏ సంస్థకు ఆ సంస్థ తమ కస్టమర్లను కాపాడుకునేందుకు విశ్వ ప్రయత్నాలే చేస్తున్నాయి.
undefined
వొడాఫోన్‌ ఐడియా కంపెనీ అప్పుల భారం తగ్గించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ఇందుకోసం ఇండస్‌ మొబైల్‌ టవర్ల కంపెనీలో ఉన్న వాటాను విక్రయించడంతో పాటు 1.56 లక్షల కిలోమీటర్ల ఆప్టికల్‌ ఫైబర్‌ నెట్‌వర్క్‌ ఆస్తులనూ విక్రయించాలని భావిస్తున్నట్టు సమాచారం. ఈ అమ్మకం ద్వారా రూ.20,000 కోట్ల వరకు సమకూరతాయని అంచనా.
undefined
గత నెలాఖరు నాటికి వొడాఫోన్ ఐడియా కంపెనీ రూ.1.23 లక్షల కోట్ల అప్పులతో సతమతమవుతోంది. ‘వొడాఫోన్‌ ఐడియా కంపెనీ తన మొబైల్‌ టవర్లు, ఆప్టికల్‌ ఫైబర్‌ ఆస్తులను విక్రయించాలని భావిస్తోంది. ఈ రెండింటి ఆస్తుల విలువ రూ.20,000 కోట్ల వరకు ఉంటుంది. దీనికి సంబంధించి చర్చలు ప్రారంభమయ్యాయి’అని పరిశ్రమవర్గాలు చెప్పాయి.
undefined
రైట్స్‌ ఇష్యూ ద్వారా రూ.25,000 కోట్లు సమీకరించాలని వొడాఫోన్‌ ఐడియా నిర్ణయించింది. ఇందులో వొడాఫోన్‌ గ్రూప్‌ రూ.11,000 కోట్లు, ఆదిత్య బిర్లా గ్రూప్‌ రూ.7,250 కోట్లు సమకూరుస్తాయి.
undefined
click me!