కోట్ల మందికి కష్టమే: ఐఫోన్లలో వర్షన్ అప్‌డేట్ కాకుంటే నో వాట్సప్!!

By sivanagaprasad kodatiFirst Published Sep 21, 2018, 8:22 AM IST
Highlights

యాపిల్ తయారు చేస్తున్న ఐ-ఫోన్లలో ఐఓఎస్ యాప్ అప్ డేట్ చేయకుంటే ఫేస్ బుక్ యాజమాన్యంలో వాట్సాప్ సేవలు ఉండబోవని మీడియాలో వార్తలొచ్చాయి. 

మీరు స్మార్ట్ ఫోన్ వాడుతున్నారా? అయితే ఒక హెచ్చరిక.. ఒక సూచన.. మరొక అడ్వైజ్. కాదంటే సజెషన్. ఎందుకంటే పూర్వకాలంలో మెసేజ్‌లు పంపాలంటే మెసెంజర్లు వెళ్లేవారు. తర్వాతీ కాలంలో టెలిగ్రామ్‌లు వచ్చేవి. కానీ టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతున్నాకొద్దీ మెసేజ్‌లు పంపడం అంత తేలికైంది.

ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చాక ‘ఈ-మెయిల్’.. ఆ పై మొబైల్ ఫోన్లు వచ్చినంక టెక్ట్స్ మెసేజ్.. తాజాగా స్మార్ట్ ఫోన్ల యుగంలో వాట్సప్ మెసేజ్‌లు కావాల్సిన వారందరికి వెళ్లిపోతున్నది. అది కోట్ల మందికి అనువైన సాధనమైంది. 

కానీ ఇక మెసేజింగ్ ‘వాట్సప్’ యాప్ యూజర్లందరికీ చేదువార్తే. ఐవోఎస్ 7 అంతకంటే పాత వెర్షన్లతో నడుస్తున్న యాపిల్ ఐఫోన్లకు వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నాయి. ఇప్పటికే వాట్సాప్‌ను ఇన్‌స్టాల్ చేసుకున్న ఐఫోన్ 4లలో మాత్రం 2020 ఫిబ్రవరి వరకు వాట్సాప్ సేవలు అందుబాటులో ఉంటాయి.

కానీ ఈ-యాప్‌ను రీ ఇన్‌‌స్టాల్ చేసుకోని యూజర్లకు మాత్రం సేవలు ఆగిపోతాయి. ఇకపై పాత ఐ-ఫోన్లలో ఉండే యాప్ కొత్త ఫీచర్లు అందవని, అప్‌డేట్స్ కూడా రావని సమాచారం. అంతేకాదు.. ఇప్పటికే ఉన్న ఫీచర్లు కూడా పనిచేయడం మానేస్తాయని తెలుస్తోంది.
 
ఐవోస్ వెర్షన్ 7, ఇతర పాత ఓఎస్‌తో పనిచేసే ఫోన్లలో 2020  ఫిబ్రవరి ఒకటో తేదీ నుంచి వాట్సాప్ సేవలు నిలిచిపోనున్నట్టు గతంలోనే వాట్సాప్ ప్రకటించింది. కాగా, నోకియా సింబియాన్ ఎస్ 60, బ్లాక్‌బెర్రీ ఓఎస్, విండోస్ ఫోన్ 8.0, అంతకంటే పాత ఫోన్లలో వాట్సాప్ సేవలు ఇప్పటికే నిలిచిపోయాయి.

అలాగే, ఫిబ్రవరి 1, 2020 నుంచి ఆండ్రాయిడ్ వెర్షన్లు 2.3.7 అంతకంటే పాతవాటిలోనూ వాట్సాప్ ఆగిపోతుందని సంస్థ తెలిపింది. ఫేస్ బుక్ యాజమాన్యంలో నడుస్తున్న ‘వాట్సప్’ మెసేజింగ్ యాప్‌ ‘ఐఓఎస్’ను అప్‌డేట్ చేసుకోకుంటే యాపిల్ తయారు చేసిన ఐఫోన్లలో అందుబాటులో ఉండదని మీడియాలో వార్తలు వచ్చాయి. 

click me!