నథింగ్ ఫోన్ వన్‌పై గ్రేట్ డిస్కౌంట్ ఆఫర్.. అతితక్కువ ధరకే కొనుగోలు చేసే అవకాశం...

By asianet news telugu  |  First Published Dec 26, 2022, 1:45 PM IST

నథింగ్ ఫోన్ 1 ప్రారంభ ధర రూ. 37,999, ఈ ధర వద్ద మీకు 8జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ 26 శాతం డిస్కౌంట్ తో రూ. 27,999 ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. 


ఈ ఏడాది జూలై 12న నథింగ్ ఫోన్ 1 లాంచ్ జరిగిన సంగతి మీకు తెలిసిందే. అయితే ఈ ఫోన్ ప్రారంభ ధర రూ.32,999.  కానీ లాంచ్ అయిన నెల రోజుల్లోనే ఈ ఫోన్ ధర దాదాపు రూ.6,000 పెరిగింది. దీంతో ఈ  ఫోన్  ప్రారంభ ధర రూ. 37,999కి పెరిగింది, ఇప్పుడు నథింగ్ ఫోన్ 1పై  ఫ్లిప్‌కార్ట్‌లో మంచి డిస్కౌంట్ లభిస్తోంది. ఈ ఫోన్ 26 శాతం తగ్గింపుతో రూ.27,999 ధరకి లిస్ట్ చేయబడింది. దీనితో పాటు ఫోన్‌పై క్యాష్‌బ్యాక్, డిస్కౌంట్ ఇంకా ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు కూడా ఉన్నాయి.

నథింగ్ ఫోన్ 1 ఆఫర్ 
నథింగ్ ఫోన్ 1 ప్రారంభ ధర రూ. 37,999, ఈ ధర వద్ద మీకు 8జి‌బి ర్యామ్ తో 128జి‌బి స్టోరేజ్ వేరియంట్ లభిస్తుంది. అయితే, ఇప్పుడు ఈ ఫోన్ 26 శాతం డిస్కౌంట్ తో రూ. 27,999 ధరకే ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంది. అంతేకాదు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్ నుండి ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది.

Latest Videos

బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డ్, ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో ఫోన్‌ను కొనుగోలు చేస్తే 10 శాతం (గరిష్టంగా రూ. 3,000) ఇన్స్టంట్ డిస్కౌంట్ ఉంటుంది. ఇది మాత్రమే కాదు, నథింగ్ ఫోన్ 1 పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తుంది. అంటే అన్ని ఆఫర్లతో అతి తక్కువ ధరకే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

నథింగ్ ఫోన్ 1  స్పెసిఫికేషన్లు
ఆండ్రాయిడ్ 12 నథింగ్ ఫోన్ 1తో లభిస్తుంది. ఈ ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55-అంగుళాల ఫుల్ హెచ్‌డి ప్లస్ OLED డిస్‌ప్లే ఉంది. HDR10+ డిస్ ప్లేతో సపోర్ట్ చేస్తుంది ఇంకా బ్రైట్ నెస్ 1200 నిట్స్. ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 778 G+ ప్రాసెసర్ 12జి‌బి వరకు LPDDR5 ర్యామ్, 256జి‌బి వరకు స్టోరేజ్ ఆప్షన్ ఉంది.
 
నథింగ్ ఫోన్ 1లో రెండు బ్యాక్ కెమెరాలు ఉన్నాయి, అందులో ఒక లెన్స్ 50 మెగాపిక్సెల్ సోనీ IMX 766 సెన్సార్ దీనితో OIS అండ్ EIS రెండూ సపోర్ట్ చేస్తాయి. రెండవ లెన్స్ కూడా 50-మెగాపిక్సెల్ Samsung JN1 సెన్సార్, ఇది అల్ట్రా వైడ్ యాంగిల్. ముందు భాగంలో 16-మెగాపిక్సెల్ సోనీ IMX471 కెమెరా ఇచ్చారు.  ఫోన్‌లో 4500mAh బ్యాటరీ లభిస్తుంది, దీనితో 33W వైర్ ఛార్జింగ్ ఇంకా 15W వైర్‌లెస్ ఛార్జింగ్‌తో 5W రివర్స్ ఛార్జింగ్‌కు కూడా ఉంది.

click me!