‘ఐఫోన్ఎక్స్’ ఓవర్ హీట్: అప్‌డేట్ ప్రాసెస్‌లో బర్న్.. తనిఖీలకు యాపిల్ రెడీ

By rajesh yFirst Published Nov 15, 2018, 1:45 PM IST
Highlights

యాపిల్ ఐఫోన్ ఎక్స్ మోడల్ తరుచుగా ఓవర్ హీట్ కావడంతోపాటు ఐఓఎస్ 12.1 అప్ డేట్ ప్రాసెస్‌లో మంటలు వస్తున్నాయి. అంతే కాదు ఐ ఫోన్ ఎక్స్ యూనిట్‌లో ఇమేజెస్‌లో గ్లాస్ క్రాక్, బర్న్ మార్క్స్ స్పష్టంగా కనిపిస్తున్న ఫోన్ వినియోగదారుడొకరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

వాషింగ్టన్: యాపిల్ ఐఫోన్ ఎక్స్ మోడల్ తరుచుగా ఓవర్ హీట్ కావడంతోపాటు ఐఓఎస్ 12.1 అప్ డేట్ ప్రాసెస్‌లో మంటలు వస్తున్నాయి. అంతే కాదు ఐ ఫోన్ ఎక్స్ యూనిట్‌లో ఇమేజెస్‌లో గ్లాస్ క్రాక్, బర్న్ మార్క్స్ స్పష్టంగా కనిపిస్తున్న ఫోన్ వినియోగదారుడొకరు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కంపెనీ లైటెనింగ్ కేబుల్, వాల్ అడాప్టర్ సాయంతో చార్జింగ్‌ చేస్తున్నప్పుడు ఈ సమస్య తలెత్తిందని పేర్కొన్నారు. 

ఫోన్ ఎక్స్‌ప్లోడెడ్ కాగానే ఫోన్ నుంచి చార్జర్‌ను తొలగించేసినట్లు తెలిపారు. ఆ తర్వాత ఫోన్ హీటెక్కిపోవడంతోపాటు స్మోక్ మొదలైనట్లు సదరు ట్విట్టర్ యూజర్ తెలిపారు. ఆ వెంటనే యాపిల్ మేనేజ్మెంట్ కు సమాచారం అందజేసినట్లు చెప్పారు. దీనిపై యాపిల్ మేనేజ్మెంట్ కూడా రియాక్టయింది. తదుపరి తనిఖీల కోసం సదరు ఫోన్‌ను తమ వద్దకు పంపాలని కోరింది. ఈ సమాచారాన్ని సదరు ఐఫోన్ ఎక్స్ యూజర్ ట్విట్టర్ ద్వారానే షేర్ చేసుకున్నాడు. 

అమెరికా రాజధాని వాషింగ్టన్ రాష్ట్రంలోనే ఐఫోన్ ఎక్స్‌లో ఈ సమస్య తలెత్తింది. సదరు యాపిల్ ఫోన్ యూజర్ జనవరిలో కొనుగోలు చేశాడు. త్వరలోనే సమస్యను పరిష్కరిస్తామని ట్విట్టర్ వేదికగానే యాపిల్ మేనేజ్మెంట్ రిప్లై ఇచ్చింది. ఇటీవలే శామ్‌సంగ్ గ్యాలాక్సీ నోట్ 9 ఫోన్ కూడా ఎక్స్‌ప్లోడెడ్ అయింది. కానీ ఈ ఫోన్ ను మార్కెట్లోకి విడుదల చేసినప్పుడు శామ్ సంగ్ సీఈఓ డీజే కోహ్ మాట్లాడుతూ అత్యంత సేఫెస్ట్ స్మార్ట్ ఫోన్ ‘శామ్‌సంగ్ గ్యాలాక్సీ నోట్ 9’ అని చెప్పారు. కానీ ఒక మహిళ హ్యాండ్ బ్యాగ్‌లో సదరు శామ్‌సంగ్ గ్యాలాక్సీ నోట్ 9 ఫోన్ ఎక్స్ ప్లోడెడ్ కావడంతో ఆమె మేనేజ్మెంట్‌కు వ్యతిరేకంగా కేసు నమోదు చేశారు. 
 

click me!
Last Updated Nov 15, 2018, 1:45 PM IST
click me!