కరోనా రావడంతో ఢిల్లీ-నోయిడా పరిధిలోని ఒప్పో సంస్థ మూసివేశారు. దీంతో దేశీయంగా స్మార్ట్ ఫోన్లు ఆప్ లైన్, ఆన్ లైన్ మార్కెట్లలోనూ లభ్యం కావడం లేదు. ముఖ్యంగా చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి.
న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థలు కష్టాల్లో కూరుకుపోయాయి. దేశ రాజధాని ఢిల్లీకి సమీపంలోని గ్రేటర్ నోయిడాలోని ఒప్పో ఫ్యాక్టరీ మూత పడటంతో ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఛానళ్ల నుంచి వచ్చే డిమాండ్‌ను ఒప్పో, రియల్‌మీ, వన్‌ప్లస్ అందుకోలేకపోతున్నాయి. రూ.15 వేల సబ్ కేటగిరీలో ఉన్న రియల్‌మీ, ఒప్పో స్మార్ట్‌ఫోన్లు ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ఛానల్స్‌లో దొరకడం లేదు.
ప్రీమియం స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ అయిన వన్‌ప్లస్ కూడా తన లేటెస్ట్ ఫ్లాగ్‌షిప్‌లు వన్‌ప్లస్ 8, వన్‌ప్లస్ 8 ప్రొ ఓపెన్ సేల్ వాయిదా వేసింది. ఒప్పో ఫ్యాక్టరీ మూత పడటంతో వన్‌ప్లస్ ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా వల్ల తలెత్తిన పరిణామాలతో, మే ప్రారంభం నుంచి ప్రొడక్షన్ ఆగిపోయిందని, తమ సేల్స్ ప్లాన్‌ను మార్చేశామని వన్‌ప్లస్ అధికార ప్రతినిధి చెప్పారు.
భారతదేశంలో రియల్‌మీ, వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లకు కాంట్రాక్ట్ మాన్యుఫాక్చరర్‌గా ఒప్పో ఉంది. తన ఫ్యాక్టరీలో కొంతమంది ఉద్యోగులకు కరోనా పాజిటివ్ రావడంతో, ఫోన్ల తయారీని నిలిపివేసింది. ఇంకా ఫ్యాక్టరీ ఆపరేషన్స్ ప్రారంభం కాలేదని ఒప్పో అధికార ప్రతినిధి చెప్పారు.
also read ఎయిర్‌టెల్‌కు పోటీ: ఏడాది జియో ఫ్రీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వీఐపీ ఆఫర్
కరోనా ‘లాక్ డౌన్’ వల్ల స్మార్ట్ ఫోన్ల సప్లయి చెయిన్ పూర్తిగా దెబ్బతిన్నదని, ప్రస్తుత మార్కెట్ డిమాండ్‌ను అందుకోవడం సవాలుగా మారిందని రియల్‌మీ అధికార ప్రతినిధి కూడా చెప్పారు. దేశవ్యాప్తంగా ఉన్న డిస్ట్రిబ్యూషన్ పార్టనర్లతో కలిసి పనిచేస్తూ రిటైల్ పాయింట్స్‌లో స్టాక్స్‌ను అందుబాటులో ఉంచేలా చేస్తున్నామని తెలిపారు.
ప్రస్తుతం వినియోగదారుల నుంచి ఎంట్రీ, మిడ్ రేంజ్ ఫోన్లకు భారీగా డిమాండ్ వస్తున్నట్టు మరో రిటైలర్ చెప్పారు. స్మార్ట్‌ఫోన్ మార్కెట్ అంతా రూ.12 వేల నుంచి రూ.15 వేల రేంజ్‌లోనే ఉందని, కానీ స్టాక్ అందుబాటులో లేదని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అరవిందర్ ఖురానా చెప్పారు.
ఒప్పో, రియల్ మీ, శామ్‌సంగ్, షియోమీ తదితర బ్రాండ్ల ఫోన్లకు ఈ సమస్య ఉందని అఖిల భారత మొబైల్ రిటైలర్ల సంఘం పేర్కొంది. శాంసంగ్ ఎం సిరీస్ ఫోన్ కోసం వినియోగదారుల నుంచి డిమాండ్ వస్తున్నా.. స్టాక్స్ తక్కువగా ఉన్నట్టు సంఘం అధ్యక్షుడు అరవిందర్ ఖురానా తెలిపారు.
ప్రస్తుతం రూ.15 వేలు, ఆపైన కేటగిరీ మొబైల్ ఫోన్ల సేల్స్‌కు ఫైనాన్సియల్ స్కీమ్‌లు కూడా లేవని పేర్కొన్నారు. ప్రభుత్వ సపోర్ట్ లేకపోవడంతో, 20 శాతం రిటైలర్లు షాపులను మూసేసుకోవాల్సిన పరిస్థితి తలెత్తిందని ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ అరవిందర్ ఖురానా ఆందోళన వ్యక్తం చేశారు.
4