టోక్యో ఒలింపిక్స్ కోసం జపాన్ చేరుకున్న ఉగాండా వెయిట్ లిఫ్టర్...
వెయిట్ లిఫ్టర్‌తో పాటు వచ్చిన ఉగాండా అధికారులకు కరోనా పాజిటివ్, ఐసోలేషన్ కోచ్...
ఆకస్మాత్తుగా కనిపించకుండాపోయిన వెయిట్ లిఫ్టర్... మిస్సింగ్ కేసు నమోదు...
టోక్యో ఒలింపిక్స్ ప్రారంభానికి ముందే ఊహించని ట్విస్టులు ఇస్తోంది. ఇప్పటికే ఒలింపిక్ విలేజ్‌లో ఐఓఏ అధికారికి కరోనా పాజిటివ్ రాగా, ఒలింపిక్ విలేజ్ నుంచి ఓ వెయిర్ లిఫ్టర్ కనిపించకుండా పోయాడు...
ఉగాండా దేశానికి చెందిన 20 ఏళ్ల వెయిట్ లిఫ్టర్ జులియస్ సెకిటొలికో (Julius Ssekitoleko), ఒసాకాలో ఉన్న ట్రెయింగ్ క్యాంప్‌లో పాల్గొంటున్నాడు. ఒలింపిక్ గేమ్స్‌లో వెయిట్ లిఫ్టింగ్ కాంపిటీషన్స్‌లో స్లాట్ పొందలేకపోయిన జులియస్, జూలై 20న స్వదేశానికి తిరిగి ప్రయాణం కావాల్సి ఉంది.
undefined
అయితే ఆకస్మాత్తుగా హోటల్ నుంచి కనిపించుకుండా పోవడంతో ఒలింపిక్స్ అసోసియేషన్ అధికారులు,అతని కోసం గాలిస్తున్నారు. జపాన్‌లో డెల్లా వేరియంట్ కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టోక్యోలో ఎమెర్జెన్సీ అమలులో ఉంది.
ఇలాంటి సమయంలో ఉగాండా వెయిర్ లిఫ్టర్ మిస్సింగ్ కేసు, ఒలింపిక్ అధికారులకు భయాందోళనలకు గురి చేస్తోంది. జులియస్‌తో పాటు జపాన్‌కి వచ్చిన ఇద్దరు ఉగాండా అధికారులకు కరోనా పాజిటివ్ రావడం విశేషం. అతని కోచ్ కూడా ఐసోలేషన్‌లో ఉన్నాడు.
ఒలింపిక్ పోటీల్లో పాల్గొనేందుకు టోక్యోకి చేరుకున్న ఓ నైజీరియా అథ్లెట్‌కి కూడా కరోనా పాజిటివ్ వచ్చింది. దీంతో అతన్ని ఎయిర్‌పోర్టులో ఐషోలేషన్‌లో చేర్చారు అధికారులు.