నా 37 ఏళ్ల కళ, ఇన్నాళ్లకు తీరింది... థ్యాంక్యూ మై సన్ నీరజ్ చోప్రా... పీటీ ఉషా ఎమోషనల్ ట్వీట్...
వెల్‌కమ్ టూ క్లబ్... అంటూ ట్వీట్ చేసిన అభినవ్ బింద్రా...
టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన చరిత్ర సృష్టించిన భారత జావెలిన్ త్రో అథ్లెట్‌పై భారతదేశ నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్ల ప్రతీ ప్రదర్శనను ప్రశంసిస్తూ... వారికి కూతుర్లుగా, కొడుకులుగా పలకరిస్తూ ట్వీట్లు చేస్తోంది మాజీ అథ్లెట్, ‘పరుగుల రాణి’ పీటీ ఉషా...
ఫీల్డ్ అథ్లెటిక్స్‌లో భారతదేశానికి 121 ఏళ్ల తర్వాత తొలి పతకం అందించిన నీరజ్ చోప్రాను ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది పీటీ ఉషా... ‘నా 37 ఏళ్ల కళ, ఇన్నాళ్లకు తీరింది... థ్యాంక్యూ మై సన్ నీరజ్ చోప్రా... భారత్‌కి స్వర్ణం’ అంటూ ట్వీట్ చేసింది...
Realised my unfinished dream today after 37 years. Thank you my son 🇮🇳🥇 pic.twitter.com/CeDBYK9kO9
— P.T. USHA (@PTUshaOfficial)
undefined
ఒలింపిక్స్‌లో వ్యక్తిగత స్వర్ణం సాధించిన షూటర్ అభినవ్ బింద్రా కూడా నీరజ్ చోప్రా విజయాన్ని హర్షిస్తూ ట్వీట్ చేశాడు.
And Gold it is for .Take a bow, young man ! You have fulfilled a nation's dream. Thank you!
Also, welcome to the club - a much needed addition! Extremely proud. I am so delighted for you.
‘ఎట్టకేలకు సర్ణం వచ్చింది. అద్భుతం చేశావ్ నీరజ్ చోప్రా... యంగ్ మ్యాన్, నువ్వు దేశం కలను నిజం చేశావ్... థ్యాంక్యూ. వెల్‌కమ్ టూ గోల్డ్ క్లబ్... చాలా గర్వంగా ఉంది...’ అంటూ ట్వీట్ చేశాడు 2008 ఒలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన షూటర్ అభినవ్ బింద్రా...