తెలంగాణ మహిళ ప్రపంచ రికార్డు... 13 గంటల్లో 30 కి.మీ.లు ఈదిన గోలి శ్యామల...

By team teluguFirst Published Mar 20, 2021, 3:41 PM IST
Highlights

 13 గంటల 43 నిమిషాల పాటు 30 కిలోమీటర్ల పొడవైన పాక్ జలసంధిని ఏకధాటిగా ఈదిన గోలి శ్యామల...

ఈ జలసంధిని 12 గంటల 30 నిమిషాల్లోనే ఈదిన ఐపీఎల్ అధికారి రాజీవ్ త్రివేది దగ్గర ట్రైనింగ్ తీసుకున్న శ్యామల...

హైదరాబాద్‌కి చెందిన తెలుగు మహిళ గోలి శ్యామల ప్రపంచ రికార్డు క్రియేట్ చేసింది. 13 గంటల 43 నిమిషాల పాటు 30 కిలోమీటర్ల పొడవైన పాక్ జలసంధిని ఏకధాటిగా ఈది, ఈ ఘనత సాధించిన రెండో మహిళగా రికార్డుల్లో కెక్కింది 47 ఏళ్ల గోలి శ్యామల.

ఇంతకుముందు ఈ జలసంధిని 12 గంటల 30 నిమిషాల్లోనే ఈదిన ఐపీఎల్ అధికారి రాజీవ్ త్రివేది దగ్గర శ్యామల శిక్షణ తీసుకోవడం విశేషం. అంతేకాదు ఇంతకుముందు గోలి శ్యామల గంగా నదిలో 30 కిలో మీటర్ల దూరాన్ని ఏకధాటిగా గంట 50 నిమిషాల పాటు ఈదింది.

తన విజయాన్ని మహిళల విజయంగా అభివర్ణించిన గోలి శ్యామల, మహిళా లోకానికి స్ఫూర్తిగా తన గెలుపు నిలుస్తుందని ఆకాంక్షించింది. 

click me!