ఇటీవల జరిగిన ఇండోనేషియా సూపర్ సిరీస్ లో కూడా సింధు ఓటమి చవిచూశారు. ఇండోనేషియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ లో ఫైనల్స్ దాకా వెళ్లి ఓటమిని ఎదుర్కొన్నారు. ఈ సీజన్ లో తొలి టైటిల్ ని అందుకోవాలని ప్రయత్నించి సింధు విఫలమయ్యారు.
బ్యాడ్మింటన్ వరల్డ్ ఛాంపియన్, తెలుగు తేజం పీవీ సింధు ఓటమి పాలయ్యారు. కొరియన్ ఓపెన్ లో సింధు ఓటమి చవిచూశారు. తొలి రౌండ్ లోనే సింధు వెనుదిరగడం గమనార్హం. 21-7, 22-24, 15-21 తేడాతో పీవీ సీంధు ఓటమి పాలయ్యారు. తొలి రౌండ్ లోనే సింధు వెనుదిరగడంతో... ఆమె అభిమానులు నిరాశకు గురయ్యారు.
ఇదిలా ఉండగా... ఇటీవల జరిగిన ఇండోనేషియా సూపర్ సిరీస్ లో కూడా సింధు ఓటమి చవిచూశారు. ఇండోనేషియా సూపర్ సిరీస్ బ్యాడ్మింటన్ టోర్నీ లో ఫైనల్స్ దాకా వెళ్లి ఓటమిని ఎదుర్కొన్నారు. ఈ సీజన్ లో తొలి టైటిల్ ని అందుకోవాలని ప్రయత్నించి సింధు విఫలమయ్యారు.
కాగా... ఇటీవల ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్ లో పీవీ సింధు చరిత్ర సృష్టించింది. ఫైనల్లో జపాన్ క్రీడాకారిణీ నొజోమీ ఒకుహురాను ఓడించి విజేతగా నిలిచింది. సింధు 21-7, 21-7 పాయింట్లతోఒకుహురాపై తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తూ వరుస సెట్లను గెలుచుకుని విజయాన్ని అందుకుంది. విచిత్రం ఏమిటంటే... బ్యాడ్మింటన్ లో సింధు విశ్వవిజేతగా నిలిచిన తర్వాత జరిగిన రెండు సిరీస్ లలోనూ సింధు ఓటమిపాలు కావడం గమనార్హం.