చిన్న పొరపాటు.. మిస్సయిన కాంస్యం: క్రీడాకారుడికి రూ.10 లక్షల బహుమతి

By sivanagaprasad KodatiFirst Published 7, Sep 2018, 1:49 PM IST
Highlights

దేశానికి మెడల్ తెచ్చిన వారికి ఎక్కడైనా నగదు బహుమతి ప్రకటిస్తారు అలాంటిది.. చేజేతులా పతకాన్ని మిస్ చేసిన క్రీడాకారుడికి రివార్డ్‌ను ఇవ్వడం ఎక్కడైనా గమనించారా..? కానీ కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తన క్రీడాస్పూర్తిని చాటుకున్నారు

దేశానికి మెడల్ తెచ్చిన వారికి ఎక్కడైనా నగదు బహుమతి ప్రకటిస్తారు అలాంటిది.. చేజేతులా పతకాన్ని మిస్ చేసిన క్రీడాకారుడికి రివార్డ్‌ను ఇవ్వడం ఎక్కడైనా గమనించారా..? కానీ కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ తన క్రీడాస్పూర్తిని చాటుకున్నారు. ఆసియా క్రీడల్లో భాగంగా 10,000 మీటర్ల సుధీర్ఘ పరుగులో పతకం కోసం ఎంతో కష్టపడిన లక్ష్మణన్ తృతీయ స్థానంలో నిలిచాడు..

నిర్వాహకులు అతడికి కాంస్య పతకాన్ని అందించారు కూడా. 20 ఏళ్ల తర్వాత ఈ విభాగంలో పతకం లభించిందని క్రీడాకారులు, అభిమానులు పడిన ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. పరుగులో లక్ష్మణన్ కాలు పొరపాటున తెలుపు రంగు గతకు అవతల పడింది.. దీంతో అతడిని అనర్హుడిగా ప్రకటించి.. నాలుగో స్థానంలో నిలిచిన అథ్లెట్‌కు కాంస్య పతకాన్ని అందజేశారు.

తన తప్పిదంపై తీవ్ర మనస్తాపానికి గురైన లక్ష్మణన్ ఉద్వేగానికి గురయ్యాడు. దీంతో లక్ష్మణన్‌ను ప్రొత్సహించేందుకు కేంద్ర క్రీడా శాఖ మంత్రి రాజ్యవర్థన్ సింగ్  రాథోడ్ అతనికి రూ.10 లక్షల బహుమతి అందించారు. దీనిపై క్రీడాకారులు హర్షం వ్యక్తం చేశారు.

Last Updated 9, Sep 2018, 1:28 PM IST