పీవీ సింధూకి అరుదైన గౌరవం

By ramya NFirst Published 23, Feb 2019, 12:58 PM IST
Highlights

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూకి అరుదైన గౌరవం దక్కింది. 

ఇండియన్ బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధూకి అరుదైన గౌరవం దక్కింది. సింధు తేజస్ యుద్ధ విమానంలో విహరించారు. మార్చి8వ తేదీన మహిళల దినోత్సవం అన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఏరో ఇండియా షోలో ప్రత్యేకంగా ఉమెన్స్ డే స్పెషల్ ఈవెంట్ ఏవియేషన్ అధికారులు ఏర్పాటు చేశారు.

ఏవియేషన్‌ రంగంలో మహిళలు సాధించిన పురోగతికి గుర్తుగా ఏరో ఇండియా ఇవాళ పలు కార్యక్రమాలను చేపట్టింది. దానిలో భాగంగానే పీవీ సింధు, ఆస్ట్రోనాట్‌ సునీతా విలియమ్స్‌ తేజస్‌ యుద్ధ విమానంలో వివహరించాలని కోరింది. వీరితో పాటు పూర్తిగా మహిళలతో కూడిన యుద్ధ విమానం కూడా ఎగరనుంది. తేజస్‌లో విహరించినందుకు చాలా ఆనందంగా ఉందని సింధు తెలిపారు. 

Last Updated 23, Feb 2019, 12:58 PM IST