భారత్‌ ఖాతాలో మరో స్వర్ణం... పారాలింపిక్స్‌లో బ్యాడ్మింటన్ ప్లేయర్ ప్రమోద్ భగత్‌ చరిత్ర...

By Chinthakindhi RamuFirst Published Sep 4, 2021, 4:22 PM IST
Highlights

బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్3 విభాగంలో బ్రిటీష్ షట్లర్‌‌ను ఫైనల్‌లో ఓడించిన ప్రమోద్ భగత్... భారత షెట్లర్ మనోజ్ సర్కార్ కాంస్యం... టోక్యో పారాలింపిక్స్‌లో 17కి చేరిన భారత పతకాల సంఖ్య...

టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్ల అద్భుత ప్రదర్శన కొనసాగుతూనే ఉంది. తాజాగా భారత ఖాతాలో మరో స్వర్ణం చేరింది. బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్3 విభాగంలో బ్రిటీష్ షట్లర్‌తో జరిగిన ఫైనల్‌లో 21-14, 21-17 తేడాతో వరుస సెట్లను గెలిచిన ప్రమోద్ భగత్ స్వర్ణం కైవసం చేసుకున్నాడు...

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కి ఇది నాలుగో గోల్డ్ మెడల్, కాగా ఈ రోజు రెండో స్వర్ణం. బ్యాడ్మింటన్ ఎస్‌ఎల్ 3 విభాగంలో కాంస్య పతకం కోసం జరిగిన మ్యాచ్‌లో జపనీస్ షెట్లర్‌ను 22-20, 21-13 తేడాతో ఓడించిన భారత షెట్లర్ మనోజ్ సర్కార్ కాంస్యాన్ని గెలిచాడు. దీంతో టోక్యో పారాలింపిక్స్‌లో భారత పతకాల సంఖ్య 17కి చేరింది.

అంతకుముందు శనివారం ఉదయం భారత మెన్స్ షూటర్లు మనీష్ నర్వాల్, సింగ్‌రాజ్ ఆదాన రెండు పతకాలను సాధించిన విషయం తెలిసిందే. 50 మీటర్ల షూటింగ్ మిక్స్‌డ్ పిస్టల్ ఈవెంట్‌లో పోటీపడిన భారత షూటర్లు మనీష్ నర్వాల్ స్వర్ణం సాధించగా... సింగ్‌రాజ్ ఆదాన రజతం సాధించాడు...

ఇప్పటిదాకా టోక్యో పారాలింపిక్స్‌లో నాలుగు స్వర్ణాలు, ఏడు రజతాలు, ఆరు కాంస్య పతకాలు సాధించిన భారత జట్టు... పాయింట్ల పట్టికలో 25వ స్థానంలో కొనసాగుతోంది.

 

click me!