మొన్న పీవీ సింధు.. నేడు హిమదాస్

First Published 17, Jul 2018, 1:39 PM IST
Highlights

దీనిపై సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి. ముఖ్యంగా హిమదాస్ సొంత రాష్ట్రమైన అస్సోంలోనే ఆమె కులం గురించి ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేయడం గమనార్హం. 

వరల్డ్ అండర్‌-20 అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్‌లో 400 మీటర్ల ఈవెంట్‌లో రికార్డ్‌ టైమింగ్‌తో భారత అథ్లెట్‌ హిమ దాస్‌ స్వర్ణ పతకం నెగ్గిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై ఆమెను దేశం మొత్తం ప్రశంసలతో ముంచేస్తుంది. బంగారు తల్లికి బంగారు పథకం అందిస్తున్న సమయంలో ఆమె భావోద్వేగాలు దేశం మొత్తాన్ని కదిలించాయి. ఓ వైపు జనగణమన ఆలపిస్తూ.. మరోవైపు కన్నీటితో దేశానికి అభిషేకం చేసిన తీరు ప్రధాని మోదీని సైతం కదిలించింది.

కాగా.. ఇప్పుడు హిమదాస్ కి సంబంధించిన విషయంలో చాలా మంది విమర్శలు ఎదుర్కొంటున్నారు. రియో ఒలంపిక్స్ లో రజత పతకం గెలిచిన సమయంలో పీవీ సింధు కూడా ఇలాంటిదే ఎదుర్కొంది. ఇంతకీ ఆ విషయం ఏంటో తెలుసా.. క్యాస్ట్. ప్రస్తుతం నెట్టింట ఎక్కువ మంది హిమదాస్ కులం ఎంటో తెలుసుకోవాలనుకుంటున్నారు.

ఆమె పతకం గెలిచిన దానికన్నా.. కూడా ఎక్కువగా ఆమె కులం తెలుసుకునేవాలనే తాపత్రయమే కనపడుతోంది. గతంలో పీవీ సింధూ విషయంలోనూ నెటిజన్లు ఆమె కులం ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే.. దీనిపై సర్వత్రా విమర్శలు వినపడుతున్నాయి. ముఖ్యంగా హిమదాస్ సొంత రాష్ట్రమైన అస్సోంలోనే ఆమె కులం గురించి ఎక్కువగా గూగుల్ సెర్చ్ చేయడం గమనార్హం. 

Last Updated 17, Jul 2018, 1:39 PM IST