డీఎస్పీగా ఒలింపిక్ విన్నింగ్ బాక్సర్ లవ్‌లీనా... రూ. కోటి రివార్డుతో పాటు ప్రతీ నెలా...

By Chinthakindhi RamuFirst Published Aug 12, 2021, 7:50 PM IST
Highlights

భారత బాక్సర్ లవ్‌లీనాకి అస్సాం పోలీస్‌ డిపార్టుమెంట్‌లో డీఎస్పీ పదవి.. కోటి రూపాయల పారితోషికం... ప్రతీ నెలా లక్ష రూపాయల స్కాలర్‌షిప్ ప్రకటించిన అస్సాం ముఖ్యమంత్రి...

టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం నెగ్గిన భారత మహిళా బాక్సర్ లవ్‌లీనాపై వరాల జల్లు కురిపించింది అస్సాం రాష్ట్ర ప్రభుత్వం. అస్సాం రాష్ట్రానికి చెందిన లవ్‌లీనా, విశ్వ వేదికపై భారత్‌కి పతకం తేవడం గర్వకారణమని చెప్పిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బస్వ శర్మ... ఆమెకు రూ.కోటి నగదు బహుమతిని కూడా ప్రకటించారు...

‘అస్సాం రాష్ట్రానికి వెలుగు తెచ్చిన లవ్‌లీనాకి గౌరవంగా ఆమెను అస్సాం పోలీసు డీఎస్‌పీగా నియమించడం జరుగుతుంది. అలాగే ఆమెకి కోటి రూపాయల నగదు పారితోషికం అందిస్తున్నాం. అంతేకాకుండా పారిస్ ఒలింపిక్స్‌కి కావాల్సిన ప్రిపరేషన్స్ కోసం ప్రతీ నెలా లక్ష రూపాయలు స్కాలర్‌షిప్‌ అందిస్తాం...’ అంటూ తెలిపారు హిమంత బస్వ. 

అస్సాం రాష్ట్ర సంప్రదాయ పద్ధతిలో లవ్‌లీనాకి స్వాగతం పలికిన సీఎం హిమంత బస్వ... గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రపంచ వేదికపై సత్తా చాటగల క్రీడాకారులు ఉంటారని ఆమె నిరూపించిందంటూ ట్వీట్ చేశారు...

With pride & glory, I welcomed our star Olympian medalist at Guwahati airport. Lovlina has ignited a billion dreams with her success in and set an example for budding sports talents in rural areas to aspire for achieving big at the world stage. pic.twitter.com/glcLxgSEml

— Himanta Biswa Sarma (@himantabiswa)

టోక్యో ఒలింపిక్స్‌ 2020లో భారత మెన్స్ బాక్సర్లు అందరూ పూర్తిగా విఫలం కాగా... మహిళా బాక్సర్లలో కూడా లవ్‌లీనా బోర్గో‌హైన్ మినహా మిగిలిన ఎవ్వరూ పతకం సాధించలేకపోయారు. టోక్యోలో సెమీస్‌లో ఓడి కాంస్య పతకంతో సరిపెట్టుకున్న లవ్‌లీనా, పారిస్ 2024లో స్వర్ణ పతకం గెలుస్తాననే ధీమా వ్యక్తం చేసింది. 

click me!