ఒలింపిక్ విన్నర్, స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై మర్డర్ కేసు... తోటి రెజ్లర్ హత్యకేసులో...

By Chinthakindhi Ramu  |  First Published May 7, 2021, 1:15 PM IST

2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం,  2012లో రజత పతకం సాధించిన సుశీల్ కుమార్....

ఢిల్లీలో రెండు వర్గాల మధ్య జరిగిన యువ రెజ్లర్ దుర్మరణం... ఘర్షణకు ఉసిగొల్పి, హత్యకు కారణమైనట్టు సుశీల్ కుమార్‌పై ఆరోపణలు...


ఒలింపిక్స్‌లో రెండు మెడల్స్ సాధించిన భారత స్టార్ రెజ్లర్ సుశీల్ కుమార్‌పై హత్యకేసు నమోదైంది. ఢిల్లీలోని ఛత్రపాల్ స్టేడియంలో జరిగిన ఓ గొడవ, ఓ రెజ్లర్ హత్యకు దారి తీసింది. ఈ గొడవ జరిగిన సమయంలో సుశీల్ కుమార్ అక్కడే ఉండడంతో పాటు ఘర్షణ జరగడానికి కారణం అతనేనని అనుమానిస్తున్నారు పోలీసులు.

సుమారు 4 గంటల పాటు జరిగిన ఈ ఘర్షణల్లో ఇద్దరు వ్యక్తులు, తుపాకీలతో దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో 22 యువ రెజ్లర్ సాగర్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సుశీల్ కుమార్‌పై హత్యానేరం కేసు నమోదుచేసిన పోలీసులు, అతని కోసం గాలిస్తున్నారు. అయితే సుశీల్ కుమార్ మాత్రం ఈ సంఘటనపై తనకే సంబంధం లేదంటున్నాడు.

Latest Videos

2008లో బీజింగ్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన సుశీల్ కుమార్, 2012లో రజత పతకం సాధించి రికార్డు క్రియేట్ చేశాడు. ‘రాజీవ్ ఖేల్‌రత్న’తో పాటు ‘అర్జున’ అవార్డు కూడా సొంతం చేసుకున్న సుశీల్ కుమార్‌పై హత్యకేసు నమోదుకావడం కలకలం రేపుతోంది.

click me!