
ఓడీఐ వరల్డ్ కప్ లో ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ కోసం అభిమానులు ఎంతో ఉత్సాహంతో ఎదురు చూస్తున్నారు. ఈ మ్యాచ్ ముందుగా అనుకున్న దానికంటే ఒకరోజు ముందే జరగనుంది. అక్టోబర్ 14కి రీషెడ్యూల్ చేశారు. ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మరిన్ని సర్దుబాట్లు జరగవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ మార్పులకు సంబంధించిన అధికారిక ప్రకటన జూలై 31న వెలువడే అవకాశం ఉంది.
గత వారం, బీసీసీఐసెక్రటరీ జే షా మాట్లాడుతూ, ఓడీఐ ప్రపంచ కప్ షెడ్యూల్‌లో మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉందని తెలిపారు. మూడు బోర్డులు ఐసీసీకి షెడ్యూల్ సర్దుబాటు కోసం అభ్యర్థించాయి. మ్యాచ్ ల మధ్య గ్యాప్‌ను 4-5 రోజులకు తగ్గించేందుకు మ్యాచ్‌ల తేదీలు, సమయాలను మాత్రమే మారుస్తామని కూడా ఆయన తెలిపారు. టైమ్‌టేబుల్ సర్దుబాటు కోరిన వారి పేర్లను బీసీసీఐ కార్యదర్శి ప్రకటించలేదు.
‘షెడ్యూల్ మార్పు కోసం ముగ్గురు సభ్యులు ICCకి లేఖ రాశారు. తేదీ, సమయాలు మాత్రమే మారతాయి, వేదికలు మారవు. ప్రస్తుతం ఆటల మధ్య ఆరు రోజుల గ్యాప్ ఉంటే, మేం దానిని 4-5 రోజులకు తగ్గించడానికి ప్రయత్నిస్తున్నాం. మూడు-నాలుగు రోజుల్లో దీనికి సంబంధించిన పూర్తి స్పష్టత వస్తుంది. ఐసిసితో సంప్రదింపులు జరిపి మార్పులు జరుగుతాయి" అని షా చెప్పారు.
2023 ఓడీఐ ప్రపంచ కప్‌లో భారత్ వర్సెస్ పాకిస్తాన్ ఫైట్ ను తిరిగి షెడ్యూల్ చేయడానికి కారణం తెలుపుతూ.. అక్టోబర్ 15న హిందువుల పండుగ నవరాత్రి ప్రారంభమవుతుంది. అదే రోజు ఈ మ్యాచ్ ఉంటే తగిన భద్రతను ఏర్పాటు చేయడం గురించి అహ్మదాబాద్‌లోని స్థానిక పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. మతపరమైన వేడుకలతో పండుగ వాతావరణం ఉన్న సమయంలో దాయదుల పోరుతో భద్రతా ఏర్పాట్లు నిర్వహించడం కష్టంగా మారుతుంది అని తెలపడంతో ఈ మార్పు జరిగిందని తెలిపారు.
భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ ను చూసేందుకు అహ్మదాబాద్‌కు విమానాలు, హోటళ్ల బుకింగ్‌తో సహా ఇప్పటికే ప్రయాణ ఏర్పాట్లు చేసుకున్న అభిమానులు, వాటాదారులలో ఈ షెడ్యూల్ మార్పు ప్రకటన ఆందోళన కలిగించింది. ఈ మ్యాచ్ ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా చూసే మ్యాచ్ లల్ో ఒకటి. ఈ మ్యాచ్ కోసం ఇరు దేశాల అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
క్రికెట్ ప్రపంచ కప్ చరిత్రలో పాకిస్తాన్‌పై భారత్ కు 7-0 హెడ్-టు-హెడ్ రికార్డు ఉంది. జట్లు చివరిసారిగా 2019 ప్రపంచ కప్‌లో తలపడ్డాయి. 2023 మార్క్యూ ఈవెంట్‌లో ఈ జట్ల మధ్య పోరుమీద ఎక్కువ మంది ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.