నీరజ్ చోప్రా జావెలిన్‌ను దాచిన పాకిస్తాన్ అథ్లెట్ అర్షద్ నదీం... ఒలింపిక్ ఫైనల్‌కి ముందు..

By Chinthakindhi RamuFirst Published Aug 25, 2021, 3:52 PM IST
Highlights

టోక్యో ఒలింపిక్స్ ఫైనల్స్‌లో రెండో ప్రయత్నంలో 87.56 మీటర్లు విసిరి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా... పాకిస్తానీ అథ్లెట్ చేసిన పని వల్ల కంగారు పడ్డానని తెలిపిన నీరజ్...

టోక్యో ఒలింపిక్స్ 2020లో జావెలిన్ త్రో ఈవెంట్‌లో స్వర్ణం సాధించి, సరికొత్త చరిత్ర క్రియేట్ చేశాడు భారత అథ్లెట్ నీరజ్ చోప్రా. ఫైనల్‌లో వేసిన రెండో త్రోతోనే విజయం కన్ఫార్మ్ అయినట్టుగా సెలబ్రేట్ చేసుకున్న నీరజ్ చోప్రా... ఈ పోటీలకు ముందు జరిగిన ఓ సంఘటనను మీడియాతో పంచుకున్నాడు...

‘‘ఫైనల్‌కి ముందు నా జావెలిన్ కనిపించలేదు. అది ఎక్కడుందా? అని వెతుకుతుంటే... అర్షద్ నదీం (పాకిస్తాన్ జావెలిన్ త్రో అథ్లెట్) నా జావెలిన్‌‌తో ఉండడం చూశా... వెళ్లి, ‘భాయ్ అది నా జావెలిన్, నాకు ఇచ్చేయ్... వెళ్లి వేసి వస్తా...’ అని అడిగాను. నేను అడగ్గానే అర్షద్, నాకు దాన్ని ఇచ్చాడు... అందుకే మొదటి త్రో వేసినప్పుడు కాస్త తొందరపడ్డాను...’’ అంటూ చెప్పుకొచ్చాడు నీరజ్ చోప్రా...

క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో నీరజ్ చోప్రాతో పాటు మంచి పర్పామెన్స్ చూపించి... ఫైనల్‌కి అర్హత సాధించిన పాకిస్తాన్ జావెలిన్ త్రో అథ్లెట్ అర్షద్ నదీం, మెడల్ పోరులో మాత్రం ఆశించిన పర్ఫామెన్స్ ఇవ్వలేకపోయాడు... 

ఫీల్డ్ అథ్లెట్టిక్స్‌లో భారత్‌కి 121 ఏళ్ల తర్వాత తొలి స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, ఆ విజయం తర్వాత భారత్‌లో అనేక సమావేశాలకు, సభలకు హాజరయ్యారు. ఈ కారణంగా అస్వస్థతకు గురైన నీరజ్ చోప్రా... విశ్రాంతి లేకుండా సభలు, సమావేశాలకు హాజరుకావడం వల్లే అనారోగ్యానికి గురైనట్టు తెలిపాడు. 

2018 కామన్వెల్త్ గేమ్స్, ఆసియా గేమ్స్‌లో స్వర్ణం సాధించిన నీరజ్ చోప్రా, టోక్యో ఒలింపిక్స్ ఫైనల్స్‌లో 87.56 మీటర్లు విసిరి స్వర్ణం సాధించాడు... ఆసియా క్రీడల్లో కాంస్యం గెలిచిన అర్షద్ నదీం, నీరజ్ చోప్రాని తన ఇన్‌స్పిరేషన్‌గా ప్రకటించాడు. 

click me!