క్రీడా పురస్కారాల వివాదం : భారత జట్టు కోచ్ రాజీనామా

By Arun Kumar PFirst Published Sep 24, 2018, 3:53 PM IST
Highlights

భారత ప్రభుత్వం ప్రకటించిన క్రీడా పురస్కారాలు వివాదాస్పదంగా మారాయి. ఇప్పటికే తమకు రాజీవ్ ఖేల్ రత్న అవార్డు రాకపోవడంతో రెజ్లర్ భజరంగ్ పూనియా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇతడు ఏకంగా క్రీడా మంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్ ను కలిసి ఫిర్యాదు కూడా చేశాడు. ఇపుడు మరో అవార్డుపై వివాదం రేగుతోంది. ద్రోణాచార్య అవార్డు రాకపోవడంతో మనస్థాపానికి గురైన ఓ ఆర్చరీ కోచ్ రాజీనామా చేశాడు. 

భారత ఆర్చరీ కాంపౌండ్ విభాగం జట్టు కోచ్ గా వ్యవహరిస్తున్న జీవన్ జ్యోత్ సింగ్ తేజ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించాడు. ఇటీవల ఇండోనేషియాలో జరిగిన ఆసియ క్రీడల ఆర్చరీ కాంపౌండ్ విభాగంలో మహిళా, పురుషుల టీమ్ రెండూ రజత పతకాలతో అదరగొట్టాయి. ఈ ఇరు జట్లకు జీవన్ జ్యోత్ కోచ్ గా ఉన్నారు. దీంతో ఈసారి ఇతడికి ద్రోణాచార్య అవార్డు ఖాయమని అందరూ భావించారు. అయితే హటాత్తుగా అతడి పేరును కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ అవార్డుల నామినీల లిస్టులోంచి తొలగించడం వివాదానికి కారణంగా మారింది.

మొదట ఇతడి పేరును అవార్డుల సెలక్షన్ కమిటీ నామినీల జాబితాలో చేర్చింది. అయితే గతంలో జరిగిన ప్రపంచ యూనివర్సిటీ క్రీడల సందర్భంగా ఇతడు  క్రమశిక్షణారాహిత్యానికి పాల్పడినట్లు క్రీడా మంత్రిత్వ శాఖ ఆరోపిస్తోంది. అందువల్ల ఇతడి పేరును అత్యుత్తమ కోచ్ లకు అందించే ద్రోణాచార్య అవార్డు నామినీల లిస్టు నుండి తొలగించింది. 

ఈ వ్యవహారంలో తన పాత్ర లేదని విచారణలో తేలినా క్రీడా శాఖ తన పేరును కావాలనే నామినీల లిస్టు నుండి తొలగించిందని జీవన్ జ్యోత్ సింగ్ ఆవేధన వ్యక్తం చేశాడు. ద్రోణాచార్య అవార్డు రాకపోవడంతో భారత ఆర్చరీ జట్టు కోచ్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు జీవన్ జ్యోత్ ప్రకటించాడు.  

మరిన్ని వార్తలు

కోహ్లీకి ఖేల్ రత్న ; శ్రీనివాస రావుకు ద్రోణాచార్య : సిక్కి రెడ్డికి అర్జున

click me!