మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీలో స్కూల్ ప్రీమియ‌ర్ లీగ్ కౌంట్‌డౌన్ షురూ.. రిజిస్ట్రేష‌న్స్ ప్రారంభం!

By Rajesh Karampoori  |  First Published Jul 28, 2023, 11:52 PM IST

హైదరాబాద్‍లోని మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ(MSDCA)లో స్కూల్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్‌-1 టీ20 లీగ్ జరగనుంది. ఈ లీగ్‍ కు సంబంధించిన రిజిస్ట్రేషన్ ప్రక్రియ షూరు అయ్యింది.  


మ‌హేంద్ర సింగ్‌ ధోనీ క్రికెట్ అకాడ‌మీ (MSDCA) స్కూల్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్‌-1 టీ20 లీగ్ జరుగునున్నది. ఇందుకోసం రంగం సిద్ధ‌మైంది. ఎంఎస్‌డీసీఏ, బ్రైనియాక్స్ బీ, ప‌ల్ల‌వి ఫౌండేష‌న్ స‌హ‌కారంతో స్కూల్ ప్రీమియ‌ర్ లీగ్ సీజ‌న్‌-1ను నిర్వ‌హిస్తున్నారు. ఈ స్కూల్ టీ20 ప్రీమియర్ లీగ్  బాలుర అండర్-14, బాలికల అండర్-16 కేటగిరీల్లో జరగనుంది. ఈ మేరకు హైదరాబాద్‍ నాచారంలోని  ఢిల్లీ ప‌బ్లిక్ స్కూల్‌లోని ఎంఎస్‌డీసీఏ హైపెర్ఫామెన్స్ సెంట‌ర్‌లోని 7H స్పోర్ట్స్ సంస్థ డైరెక్ట‌ర్ బి.వెంక‌టేష్ ప్ర‌క‌టించారు. 

అనంత‌రం ప‌ల్ల‌వి, డీపీఎస్ (నాచారం) విద్యాసంస్థ‌ల సీఓఓ మ‌ల్కా య‌శ‌స్వీ మాట్లాడుతూ ప్ర‌తిభావంతులైన క్రికెట‌ర్ల‌ను చేయూత అందించేందుకు ఎంఎస్ ధోనీ క్రికెట్ అకాడ‌మీ స్కూల్ లెవ‌ల్‌లో లీగ్‌ను నిర్వ‌హిస్తున్నట్టు ప్రకటించారు.  ప్రతిభవంతులైన క్రీడాకారులు సెలెక్ష‌న్ ట్ర‌య‌ల్స్‌లో పాల్గొని, లీగ్‌లో ఆడే అవ‌కాశాన్ని అందిపుచ్చుకోవాల‌ని కోరారు. లీగ్‌లో ఉత్తమ ప్రతిభ క‌న‌బ‌ర్చిన టాప్ ఐదుగురు ప్లేయ‌ర్ల‌కు ప‌ల్ల‌వి ఫౌండేష‌న్ ద్వారా రూ.5 ల‌క్ష‌ల విలువ గ‌ల స్కాల‌ర్‌షిప్ అందిస్తామ‌ని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.  

Latest Videos

ఉచిత శిక్ష‌ణ‌..

మారుమూల ప్రాంతాల‌కు చెందిన టాలెంటెడ్ క్రికెట‌ర్ల‌ను అన్వేషించి, వారిని ప్రోత్స‌హించాల‌నే ల‌క్ష్యంతో ఈ లీగ్ నిర్వహిస్తున్నట్టు   ఆంధ్ర‌, తెలంగాణ‌, క‌ర్ణాట‌క ఎంఎస్‌డీసీఏ అధీకృత భాగస్వామైన బ్రైనియాక్స్ బీ డైరెక్ట‌ర్ ర‌షీద్ బాషా తెలిపారు. బాలుర అండ‌ర్‌-14, బాలిక‌ల అండ‌ర్‌-16 కేట‌గిరీల్లో ఈ టీ20 స్కూల్ లీగ్‌ను నిర్వ‌హించ‌నున్న‌ట్టు తెలిపారు. లీగ్‌లో ఉత్త‌మ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర్చిన ఐదుగురు క్రికెట‌ర్ల‌కు ఆరు నెల‌లు పాటు హైద‌రాబాద్‌లోని ఎంఎస్‌డీసీఏ సెంట‌ర్ల‌ల్లో ఉచిత శిక్ష‌ణ అందిస్తామని చెప్పారు. ఈ 

లీగ్ స్వ‌రూపం

బాలుర అండర్-14, బాలికల అండర్-16 విభాగాల్లో MSDCA టీ20 స్కూల్ లీగ్ జరగనుంది. ఈ లీగ్‌లో మొత్తం ఎనిమిది జ‌ట్లు త‌ల‌ప‌డ‌నున్నాయి. ఫ్రాంచైజీ టీమ్ మోడ‌ల్‌లో లీగ్‌ను నిర్వ‌హించ‌నున్నారు. ఇప్పటికే ఈ లీగ్ రిజిస్ట్రేష‌న్స్ ప్రారంభ‌మ‌య్యాయనీ, మేరా ఈవెంట్స్ వెబ్‍సైట్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని నిర్వాహకులు తెలిపారు. రిజిస్ట్రేష‌న్‌కు ఆఖ‌రి తేదీ ఆగ‌స్టు 17వ తేదీ కాగా.. ఆగ‌స్టు 20న  హైద‌రాబాద్‌లోని మహేంద్ర సింగ్ ధోనీ క్రికెట్ అకాడమీ సెంటర్లలో ట్ర‌య‌ల్స్ నిర్వ‌హించ‌నున్నారు. ఆగ‌స్టు 25న టీమ్ పేర్లు ప్ర‌క‌ట‌న‌, ట్రోఫీ, జెర్సీ ఆవిష్క‌ర‌ణ చేయనున్నారు. ఆగ‌స్టు 27 నుంచి లీగ్ ప్రారంభ‌మ‌వుతుందని నిర్వహకులు వెల్లడించారు.  మ‌రిన్ని వివ‌రాల కొర‌కు 7396386214, 7618703508 నెంబ‌ర్ల‌కు ఫోన్ చేసి తెలుసుకోవ‌చ్చు.
 

click me!