ఫార్ములా ఈ రేసు గ్రాండ్ సక్సెస్.. విజేత జీన్ ఎరిక్ వెర్గ్‌నే.. టాప్-5లో చోటు దక్కని మహీంద్ర

By Srinivas M  |  First Published Feb 11, 2023, 5:58 PM IST

Formula E Race:  నెల రోజులుగా  హైదరాబాద్ అభిమానులు  అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన  ఫార్ములా ఈ రేసు ఘనంగా ముగిసింది.   అతిరథ మహారథులు విచ్చేసిన ఈ రేసులో   జీన్ ఎరిక్ విజేతగా నిలిచాడు. 


కళ్లు మూసి తెరిచేలోగా దూసుకుపోయే కార్లు..  క్షణ క్షణానికి మారుతున్న ఆధిక్యత..  నువ్వా నేనా అన్నట్టు  పోటీపడ్డ రేసర్లు.. వెరసి  హైదరాబాద్ వేదికగా జరిగిన  ఫార్ములా ఈ రేస్  గ్రాండ్ సక్సెస్ అయింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన  ఈ మెగా ఈవెంట్ సుమారు గంటన్నర పాటు సాగింది.   భారత్ లో మొట్టమొదటిసారిగా జరిగిన ఈ  వరల్డ్ ఛాంపియన్  లో ‘డీఎన్ పెన్స్‌కె   రేసింగ్’ డ్రైవర్ జీన్ ఎరిక్   వెర్గ్‌నే  విజేతగా నిలిచాడు.  

ఫార్ములా ఈ  రేస్ 9వ సీజన్ లో భాగంగా   హైదరాబాద్ లో ముగిసిన నాలుగో  రేస్  లో నిన్న ముగిసిన  ప్రాక్టీస్ సెషన్ లో దూసుకెళ్లిన  రేసర్లు అసలు పోరులో వెనుకబడ్డారు. మాజీ వరల్డ్ ఛాంపియన్ అయిన జీన్ వెర్గ్‌నే.. నెక్లెస్ రోడ్డు, ట్యాంక్‌బండ్, ఐమ్యాక్స్ పరిసర  ప్రాంతాల్లో రయ్ రయ్‌మంటూ దూసుకెళ్లాడు.  

Latest Videos

undefined

డీఎస్ ఈ-టెన్స్ ఎఫ్ఈ  23  ఎలక్ట్రిక్ కారుపై   జీన్  ఎరిక్  తన జోరు చూపాడు.  ఇదే పోటీలో తన సహచర డ్రైవర్  స్టోఫెల్ వాండూర్న్  8వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ రేస్ లో  ఎన్విసన్  రేసింగ్ డ్రైవర్ నిక్ క్యాసిడే  రెండో స్థానంలో నిలిచాడు.   ట్యాగ్ హ్యూర్ పోర్షే రేసింగ్ టీమ్  డ్రైవర్  ఆంటోనియో  ఫెలిక్స్ మూడో స్థానంతో  సరిపెట్టుకోగా.. అదే టీమ్ కు చెందిన పాస్కల్ వెహ్ల్రీన్  నాలుగోస్థానంలో నిలిచాడు. 

 

Jean-Eric Vergne is winner of the first ever Greenko 🏆

Nick Cassidy in P2 & Antonio Felix Da Costa in P3 🏁

A historic and memorable result 🤩 pic.twitter.com/Wz3Gk7fhON

— Greenko Hyderabad E-Prix (@AceNxtGen)

భారత్ నుంచి పోటీ పడ్డ మహీంద్ర  రేసింగ్ టీమ్ నుంచి  ఇంగ్లాండ్ ఆటగాడు ఒలివడర్ రొనాల్డ్  ఆరో స్థానంలో ఉండగా   ఇదే టీమ్ కు చెందిన లుకాస్ డి గ్రాసి  14వ స్థానిని పరిమితమయ్యాడు.  ఈ రేసింగ్ లో తదుపరి రేస్  ఈనెల  చివర్లో   కేప్‌టౌన్ (సౌతాఫ్రికా) వేదికగా జరుగనుంది.  

 

Minister congratulating Jean-Eric Vergne who sealed victory at pic.twitter.com/cU2EBvlAeH

— Sarita Avula (@SaritaTNews)

తరలివచ్చిన తారలు : 

హైదరాబాద్ లో ముగిసిన ఈ ఈవెంట్ ను చూడటానికి  తారలు తరలివచ్చారు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తో పాటు మరికొంతమంది టాలీవుడ్ నటులు కూడా  హాజరయ్యారు.  భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, శిఖర్ ధావన్, స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్, దీపక్ చాహర్ లు ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.

 

Master Blaster at venue pic.twitter.com/EpqSOt1xML

— Sarita Avula (@SaritaTNews)
click me!