గోల్డ్ మెడల్ సాధించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా .. 86.69 మీటర్ల బెస్ట్ త్రోతో రికార్డు..

By team teluguFirst Published Jun 19, 2022, 6:16 AM IST
Highlights

ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా జావెలిన్ త్రో ఈవెంట్ లో తన సత్తా చూపాడు. 86.69 బెస్ట్ త్రోతో స్వర్ణం గెలుచుకుని ఇండియన్ ప్లేయర్ అనిపించాడు. ఒలింపిక్ గేమ్స్ లో నీరజ్ రెండో సారి పాల్గొనగా.. ఈ సారి గోల్డ్ మెడల్ అందుకున్నాడు. 

ఒలింపిక్ ఛాంపియన్ నీరజ్ చోప్రా (Neeraj Chopra) జావెలిన్ త్రో ఈవెంట్ లో తన సత్తా చూపించాడు. శనివారం ఫిన్‌లాండ్‌లోని కుర్టానే గేమ్స్‌లో ఇండియన్ ప్లేయర్ దమ్ము ప్రదర్శించాడు నీరజ్.  తన మొదటి ప్రయత్నంలోనే 86.69 మీటర్ల త్రో నమోదు చేసి బంగారు పతకాన్ని గెలుచుకున్నాడు. నీరజ్ ట్రినిడాడ్ మరియు టొబాగోకు చెందిన కెషోర్న్ వాల్కాట్, గ్రెనడాకు చెందిన ప్రపంచ ఛాంపియన్ అండర్సన్ పీటర్స్ ను దాటుకొని మొదటి స్థానాన్ని చేరుకున్నాడు. ఇటీవలే కొత్త జాతీయ రికార్డును నెలకొల్పిన చోప్రా, తన 86.69 మీటర్ల త్రోతో అందరినీ ఆశ్చర్య పరిచాడు. 

అదేవిధంగా తన ప్రత్యర్థులు కూడా నీరజ్ చోప్రా త్రోయింగ్ ఫిదా అవుతున్నారు. అయితే ఈ గేమ్ లో నీరజ్ రెండు ఫౌల్ త్రోలు చేసాడు. చివరి మూడు త్రోల తర్వాత వైదొలిగాడు. టోక్యో ఒలింపిక్స్ తర్వాత ఇది ఆయనకు రెండో పోటీ. ఇక్కడ నీరజ్ అథ్లెటిక్స్‌లో బంగారు పతకాన్ని గెలుచుకున్న మొదటి భారతీయుడిగా రికార్డు క్రియేట్ చేసుకున్నాడు. నీరజ్ తర్వాత వాల్‌కాట్ 86.64 మీటర్ల త్రోతో రెండో స్థానంలో నిలిచాడు. పీటర్స్ 84.75 ఉత్తమ ప్రయత్నంతో మూడో స్థానంలో నిలిచాడు. అదే విధంగా చోప్రాతో పాటు కుర్టానే ఒలింపిక్ శిక్షణా కేంద్రంలో శిక్షణ పొందుతున్న  ప్రపంచ పారి జావెలిన్ ఛాంపియన్ సందీప్ చౌదరి కూడా పోటీలో పాల్గొని 60.35 మీటర్ల బెస్ట్ త్రోతో ఎనిమిదో స్థానాన్ని దక్కించుకున్నాడు. 

click me!