టోక్యో ఒలింపిక్స్: ఆసియా రికార్డు బ్రేక్ చేసినా, ఫైనల్‌కి అర్హత సాధించలేకపోయారు....

By Chinthakindhi Ramu  |  First Published Aug 6, 2021, 5:32 PM IST

మెన్స్ 4X400 రిలే క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో ఆసియా రికార్డు క్రియేట్ చేసిన భారత అథ్లెట్లు...


టోక్యో ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. పథకాల పంట పండకపోయినా, ఒలింపిక్స్‌లో మనవాళ్ల ప్రదర్శన మాత్రం చాలా మెరుగైంది. మెన్స్ 4X400 రిలే క్వాలిఫికేషన్స్ రౌండ్‌లో భారత అథ్లెట్స్ మహ్మద్ అనాస్, నిర్మా నోవా, అరోకియా రాజీవ్, అమోజ్ జాకోబ్ 3:00.25 సెకన్లలో ముగించి, ఆసియా రికార్డు క్రియేట్ చేశారు...

అయితే హీట్ 2లో నాలుగో స్థానంలో నిలిచిన భారత అథ్లెట్లు, ఫైనల్స్‌కి అర్హత సాధించలేకపోయారు. కేవలం టాప్ 3లో నిలిచిన టీమ్‌లకు మాత్రమే ఫైనల్‌ ఆడే అవకాశం దక్కుతుంది. 

Latest Videos

undefined

టోక్యో ఒలింపిక్స్‌లో శుక్రవారం భారత్‌కి పెద్దగా కలిసి రాలేదు. కాంస్య పతక పోరులో భారత మహిళా హాకీ జట్టు, గ్రేట్ బ్రిటన్ చేతిలో 4-5 తేడాతో పోరాడి ఓడగా... స్టార్ రెజ్లర్ భజరంగ్ పూనియా సెమీస్‌లో ఓడిపోయాడు.

భారత మహిళా రెజ్లర్ సీమా బస్లా తొలి రౌండ్‌లో ఓడిపోయింది. 50 కి.మీ.ల వాకింగ్ పోటీలో పాల్గొన్న గుర్‌ప్రీత్ సింగ్, పోటీని పూర్తిచేయలేకపోయాడు. 20 కి.మీ.ల వాకింగ్‌లో ప్రియాంక గోస్వామి 17వ స్థానంలో నిలవగా, భవనా జాట్ 32వ స్థానంలో నిలిచి తీవ్రంగా నిరాశపరిచారు.

click me!