ప్రపంచంలోనే గొప్ప వ్యక్తిని పెళ్లి చేసుకున్నా.. అనుష్క

By ramya neerukondaFirst Published 8, Sep 2018, 10:05 AM IST
Highlights

అనుష్క ఎక్స్ ప్రెషన్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తున్న మీమ్స్ కూడా ఒకరకంగా సినిమా ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడుతున్నాయి. 

ప్రపంచంలోనే ఓ గొప్ప వ్యక్తిని తాను భర్తగా పొందానని బాలీవుడ్ నటి అనుష్క శర్మ అన్నారు. టీం ఇండియా కెప్టెన్ విరాట్ కోహ్లీని.. అనుష్క శర్మ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా.. కోహ్లీని ఉద్దేశించి ఆమె తాజాగా పై వ్యాఖ్యలు చేశారు. 

ప్రస్తుతం ఆమె వరుణ్ ధావన్ జంటగా.. సూయీ ధాగా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అనుష్క ఈ చిత్ర ప్రమోషన్స్ లో బిజీ బిజీగా గడుపుతున్నారు. ఈ సినిమాలో అనుష్క ఎక్స్ ప్రెషన్స్ తో నెట్టింట హల్ చల్ చేస్తున్న మీమ్స్ కూడా ఒకరకంగా సినిమా ప్రమోషన్స్ కి బాగా ఉపయోగపడుతున్నాయి. 

మరోవైపు ఇంగ్లండ్‌ పర్యటనలో ఉన్న విరాట్‌ కోహ్లి శతకం బాదినా ఈమె పేరే వినిపిస్తోంది. రెండో టెస్ట్‌ విజయానంతరం కోహ్లి మాట్లాడుతూ విజయానికి కారణం తన సతీమణి అనుష్క శర్మనేనని, ఈ విజయాన్ని ఆమెకు అంకితమిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

కాస్త విరామం దొరికిన ఈ బాలీవుడ్‌ భామ ఇంగ్లండ్‌లో ప్రత్యక్షమవుతోంది. స్వయంగా మ్యాచ్‌లకు హాజరవుతూ తన భర్తను ప్రోత్సాహిస్తున్నారు. కోహ్లి ఏమో సెంచరీ అనంతరం ఓ ఫ్లయింగ్‌ కిస్స్‌తో తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. ఇలా ఇద్దరు తమ ప్రొఫెషన్స్‌తో ఎంతో బిజీగా ఉన్నప్పటికి సమయం దొరికినప్పుడల్లా ఒకరిపై ఒకరికి ఉన్న వారి ప్రేమను చాటుకుంటున్నారు. సూయి ధాగా తొలి సాంగ్‌ విడుదల సందర్భంగా జైపూర్‌లో అభిమానులు విరాట్‌ కోహ్లి నామస్మరణం జపించారు. ఈ రెస్పాన్స్‌కు అనుష్క స్పందిస్తూ.. అతన్ని అందరూ ప్రేమిస్తారు.. నేను కూడా ప్రేమిస్తానని, ఎవరూ మరిచిపోలేరని నవ్వుతూ సంతోషం వ్యక్తం చేశారు.

Last Updated 9, Sep 2018, 11:27 AM IST