వివాహ బంధంలోకి అడుగుపెట్టిన క్రికెటర్ హనుమ విహారి

By telugu teamFirst Published 19, May 2019, 1:31 PM IST
Highlights

తెలుగు తేజం, టీం ఇండియా క్రికెటర్ హనుమ విహారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వరంగల్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతిరాజ్‌తో హన్మకొండలో హనుమ వివాహం వైభవంగా జరిగింది.

తెలుగు తేజం, టీం ఇండియా క్రికెటర్ హనుమ విహారి వివాహ బంధంలోకి అడుగుపెట్టాడు. వరంగల్ కు చెందిన ఫ్యాషన్ డిజైనర్ ప్రీతిరాజ్‌తో హన్మకొండలో హనుమ వివాహం వైభవంగా జరిగింది. గత ఏడాది అక్టోబర్ లో వీరిద్దరికి నిశ్చితార్థం జరిగింది. కాగా 20వ తేదీన వీరి రిసెస్షన్ జరుగనుంది. ఈ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు. 
 
ఆంధ్ర క్రికెట్ జట్టు తరఫున డొమెస్టిక్ క్రికెట్ ఆడిన హనుమ విహారి గత ఏడాది సెప్టెంబర్‌లో ఇంగ్లండ్‌తో జరిగిన టెస్ట్ సిరీస్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో ఆరంగేట్రం చేశాడు. భారత జట్టు తరఫున 4 టెస్టులు ఆడిన విహారి 23.9 స్ట్రైక్‌ రేటుతో 167 పరుగులు చేశాడు. వివాహం చేసుకున్న సందర్భంగా హనుమకు పలువురు క్రికెటర్లు, అభిమానులు అభినందనలు తెలిపారు.

Last Updated 19, May 2019, 1:31 PM IST