ఉంటిటి వన్ గోల్.. ఫైనల్‌కు ఫాన్స్..!

First Published Jul 11, 2018, 10:21 AM IST
Highlights

20 ఏళ్ళ నిరీక్షణ ఫలించింది. ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌కు చోటు దక్కింది. మంగళవారం అర్థరాత్రి బెల్జియంతో హోరాహోరీగా ఆడిన మ్యాచ్‌లో 51వ నిముషంలో శామ్యూల్ ఉంటిటి చేసిన గోల్ ఫ్రాన్సుకు 1-0 తేడాతో విజయాన్ని అందించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఉంటిటి నిలిచాడు. బెల్జియం నిష్క్రమించగా క్రొయేషియా లేదా ఇంగ్లండ్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఫ్రాన్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నది.

హైదరాబాద్: 20 ఏళ్ళ నిరీక్షణ ఫలించింది. ఫైనల్స్‌లో ఫ్రాన్స్‌కు చోటు దక్కింది. మంగళవారం అర్థరాత్రి బెల్జియంతో హోరాహోరీగా ఆడిన మ్యాచ్‌లో 51వ నిముషంలో శామ్యూల్ ఉంటిటి చేసిన గోల్ ఫ్రాన్సుకు 1-0 తేడాతో విజయాన్ని అందించింది. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఉంటిటి నిలిచాడు. బెల్జియం నిష్క్రమించగా క్రొయేషియా లేదా ఇంగ్లండ్‌తో ఫైనల్ మ్యాచ్ ఆడేందుకు ఫ్రాన్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నది.
 
ఆట ఆరంభం నుంచి ఎప్పుడైనా గోల్ పడవచ్చు అన్నంత ఉత్కంఠ భరితంగా సాగింది. ఇరు జట్లు నువ్వా నేనా అన్న రీతిలో తల పడ్డాయి. మొదట్లో ఫ్రాన్స్ బాల్‌ను తన కంట్రోల్లో ఉంచుకుంది. ఆటపై తన ఆధిక్యాన్ని ప్రదర్శించడానికి ప్రయత్నించింది. కానీ అంతలోనే బెల్జియం ప్లేయర్స్ గోల్ పోస్టులపై ఫ్రాన్స్ దాడిని ఆదిలోనే అడ్డుకోవడం మొదలు పెట్టారు. ఇక ఇరుపక్షాల గోల్ కీపర్లు అద్భుతంగా కట్టడి చేశారు. బాల్‌ చొరబడ్డానికి ఇసుమంతైనా చోటు లేదన్నట్టుగా నెట్ అంతా ఆక్రమించుకున్నట్టుగా చక్కగా కట్టడి చేశారు. 15వ నిముషంలో ఎడెన్ హాజర్డ్ ఎడమ కాలితో కొట్టిన బాల్ గోల్ చేయడంలో మిస్ అయ్యింది. 30వ నిముషంలో ఎంబాప్పే పై ఫౌల్‌కు జాన్ వెర్టొన్‌న్‌కు రిఫరీ ఆండ్రెన్స్ కునా వార్నింగ్ ఇచ్చాడు. 45వ నిముషానికి అదనంగా స్టాపేజ్ టైమ్ అని చెప్పి ఒక నిముషం ఇచ్చారు. అయినా కాని బాల్ కాస్త వైడ్‌ అయ్యి గోల్ మిస్ అయ్యింది. అలా ఫస్టాఫ్ ఒక్క గోల్ కూడా లేకుండానే 0-0తో ముగిసిపోయింది. 

సెకండాఫ్ కూడా హోరా హోరీగానే మొదలైంది. సరిగ్గా 51వ నిముషానికి శామ్యూల్ ఉంటిటి హెడర్ గోల్ చేసి ఫ్రాన్సు జట్టు 1-0 ఆధిక్యాన్ని అందించాడు. గ్యాలరీల్లో ఫ్రాన్స్ అభిమానుల కరతాళ ధ్వనులు, కేకలు, ఈలలతో స్టేడియం హోరెత్తిపోయింది. ఒక్కసారిగా ఆటతో పాటుగా స్టేడియం కూడా ఫ్రాన్స్‌కు అనుకూలంగా మారిపోయినట్టు అనిపించింది. 63వ నిముషంలో బ్లెయిస్ మటౌడీపై ఫౌల్‌కు ఎడెన్ హజార్డ్‌కు రిఫరీ ఎల్లో కార్డు చూపించాడు. ఆ తర్వాత రెండు నిముషంలో మరోన్ ఫెల్లానీ సంధించిన పవర్‌ఫుల్ హెడర్ వైడ్ అయ్యి గోల్ మిస్ అయ్యింది. 

click me!