WWE స్టార్ రెజ్లర్ బ్రాడీ లీ ఆకస్మిక మరణం... 41 ఏళ్ల వయసులోనే...

Published : Dec 27, 2020, 12:55 PM IST
WWE స్టార్ రెజ్లర్ బ్రాడీ లీ ఆకస్మిక మరణం... 41 ఏళ్ల వయసులోనే...

సారాంశం

6 అడుగుల 5 అంగుల పొడవు, 275 పౌండ్ల బరువుతో ఆజానుబాహుడిగా గుర్తింపు పొందిన బ్రాడీ లీ... 41 ఏళ్ల వయసులో ఊపిరితిత్తుల వ్యాధితో మరణించిన బ్రాడీ లీ... సంతాపం వ్యక్తం చేసిన WWE స్టార్లు...

పిల్లల నుంచి పెద్దల దాకా అందర్నీ అలరించే డబ్ల్యూడబ్ల్యూఈ క్రీడా ప్రపంచంలో విషాదం చోటు చేసుకుంది. బ్రాడీ లీగా పేరొందిన రెజ్లర్ జొనాథన్ హుబర్ అనారోగ్యంతో మరణించారు. శ్వాస కోశ సమస్యలతో బాధపడుతున్న బ్రాడీ లూని... ‘లూక్ హార్పర్‌’ అని కూడా ముద్దుగా పిలిచేవాళ్లు అభిమానులు.

ఆల్‌ ఎలైట్ రెజ్లింగ్ ఇచ్చిన ప్రెస్ రిలీజ్ ప్రకారం... 41 ఏళ్ల బ్రాడీ లీ, ఊపిరితిత్తుల వ్యాధితో మరణించాడు.18 ఏళ్ల రెజ్లింగ్ కెరీర్‌లో ‘బిగ్ మ్యాన్’గా గుర్తింపు పొందిన బ్రాడీ లూని... 6 అడుగుల 5 అంగుల పొడవు, 275 పౌండ్ల బరువుతో ఆజానుబాహుడిగా కనిపించేవాడు.

గుబురు గడ్డం, మీసంతో కనిపించే బ్రాడీ లీ మృతితో రెజర్లు తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ట్యాగ్ టీమ్ టైటిల్స్‌ను రెండు సార్లు గెలిచిన హూబర్, ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్‌షిప్‌ను కూడా సొంతం చేసుకున్నాడు. ఏఈడబ్ల్యూలో చేరిన తర్వాత ఏఈడబ్ల్యూ టీఎన్‌టీ ఛాంపియన్‌షిప్ గెలిచాడు జాన్ హూబర్,

PREV
click me!

Recommended Stories

INDW vs SLW : స్మృతి మంధాన సరికొత్త చరిత్ర.. ప్రపంచ రికార్డు బద్దలు ! లంకపై భారత్ ఘన విజయం
IPL 2026 : ఆర్సీబీ, సీఎస్కే లక్కీ ఛాన్స్.. ముంబై, ఢిల్లీ కొట్టిన జాక్‌పాట్ డీల్స్ ఇవే !