షూటౌట్‌లో స్పెయిన్‌పై 3-0 తేడాతో గెలిచిన మొరాకో... స్విట్జర్లాండ్‌తో మ్యాచ్‌లో 6-1 తేడాతో ఘన విజయం అందుకున్న అర్జెంటీనా...
ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో టైటిల్ ఫెవరెట్ టీమ్స్‌లో ఒకటైన స్పెయిన్‌కి ఊహించని షాక్ తగిలింది. సూపర్ 16 రౌండ్‌లో మొరాకోతో జరిగిన మ్యాచ్‌లో 3-0 తేడాతో ఓడి, ఇంటిదారి పట్టింది స్పెయిన్. స్పెయిన్, మొరాకో జట్లు రెండూ హోరాఘోరాగా సాగడంతో పూర్తి సమయం ముగిసే వరకూ ఒక్క గోల్ కూడా రాలేదు. ఎక్స్‌ట్రా ఇచ్చినా ఫలితం తేలలేదు...
దీంతో విజేతను నిర్ణయించేందుకు షూటౌట్‌ని ఎంచుకున్నారు రిఫరీలు. అయితే స్పెయిన్ ప్లేయర్లు, షూటౌట్‌లో అనవసర ఒత్తిడికి లోనై ఒక్క గోల్ కూడా చేయలేకపోయారు. అదే సమయంలో మొరాకో ఆటగాళ్లు అదిరిపోయే ఆటతీరుతో మూడు గోల్స్ సాధించి.. 3-0 తేడాతో స్పెయిన్‌కి ఊహించని షాక్ ఇచ్చారు...
undefined
ఈ విజయంతో మొరాకో క్వార్టర్ ఫైనల్‌కి దూసుకెళ్లగా, స్పెయిన్ ప్రీక్వార్టర్స్ నుంచే ఇంటిదారి పట్టింది. మరో మ్యాచ్‌లో బ్రెజిల్, దక్షిణ కొరియాపై 4-1 తేడాతో విజయం అందుకుంది. ఆట ఆరంభం నుంచే బ్రెజిల్ ప్లేయర్లు, సౌత్ కొరియాపై దాడి చేశారు...
ఆట 7వ నిమిషంలో వినీ జూనియర్ గోల్ సాధించి 1-0 ఆధిక్యం అందించగా. ఆ తర్వాత ఆట 13వ నిమిషంలో దక్కిన పెనాల్టీ కార్నర్‌ని గోల్‌గా మలిచాడు నేమర్. ఆట 29వ నిమిషంలో రిచర్‌లిసన్ గోల్ సాధించి ఆధిక్యాన్ని 3-0 తేడాకి పెంచాడు...
ఆట 36వ నిమిషంలో లుకస్ పక్వెట్టా గోల్ చేసి 4-0 ఆధిక్యాన్ని పెంచాడు. ఆట 76వ నిమిషంలో దక్షిణ కొరియా ఆటగాడు పైక్ సెయింగ్‌హో గోల్ చేసి 4-1 తేడాతో ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. మరో మ్యాచ్‌లో పోర్చుగల్, స్విట్జర్లాండ్‌పై 6-1 తేడాతో విజయం అందుకుంది.
జొకలో రమోస్ ఏకంగా మూడు గోల్స్ సాధించాడు. ఆట 17వ నిమిషంలో తొలి గోల్ చేసిన రమోస్, 51వ నిమిషంలో, 67వ నిమిషంలో గోల్స్ చేసి హ్యాట్రిక్ సాధించాడు. ఆట 33న పెప్, 55వ నిమిషంలో రపెల్ గోర్రెయో, 92వ నిమిషంలో రఫెల్ లియో గోల్స్ సాధించారు..
స్విట్జర్లాండ్ తరుపున 58వ నిమిషంలో మనుల్ అకంజీ ఏకైక గోల్ సాధించి... పోర్చుగల్ ఆధిక్యాన్ని తగ్గించగలిగాడు. క్వార్టర్ ఫైనల్స్‌లో బ్రెజిల్, క్రొటారియాతో డిసెంబర్ 9న తలబడుతుంది. డిసెంబర్ 10న నెదర్లాండ్స్ జట్టు, అర్జెంటినాతో... అదే రోజు మొరాకో, పోర్చుగల్ జట్టుతో తలబడబోతున్నాయి. ఇంగ్లాండ్, ఫ్రాన్స్ మధ్య ఆఖరి క్వార్టర్ ఫైనల్ డిసెంబర్ 11న జరుగుతుంది.