ఖతర్‌పై 2-0 తేడాతో ఘన విజయం అందుకున్న ఈక్వెడార్... అరెస్ట్ నుంచి తప్పుకోవడానికి ఈక్వెడార్ కెప్టెన్ ఎన్నెర్ వాలెన్సియా గాయం డ్రామా...
ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీ ఘనంగా ప్రారంభమైంది. మొదటి మ్యాచ్‌లో ఆతిథ్య ఖతర్ జట్టు, ఈక్వెడార్‌తో తలబడింది. ఈ మ్యాచ్‌లో ఈక్వెడార్ 2-0 తేడాతో ఆతిథ్య జట్టుపై ఘన విజయం అందుకుంది. ఈక్వెడార్ కెప్టెన్ ఎన్నెర్ వాలెన్సియా, ఆట ప్రారంభమైన తర్వాత 16వ నిమిషంలో తొలి గోల్ చేసి... జట్టుకి 1-0 ఆధిక్యం అందించాడు...
ఆ తర్వాత ఖతర్ ప్లేయర్లు గోల్ సాధించేందుకు చేసిన ప్రయత్నాలను ఈక్వెడార్ విజయవంతంగా తిప్పి కొట్టింది. ఆట 30వ నిమిషంలో మరో గోల్ చేసిన ఎన్నెర్ వాలెన్సియా... జట్టుకి 2-0 తేడాతో తిరుగులేని ఆధిక్యం అందించాడు. సెకండాఫ్‌లో ఖతర్ ప్లేయర్లు, ఈక్వెడార్ జట్టును మరో గోల్ చేయకుండా అడ్డుకోగలిగారు కానీ గోల్స్ చేయలేకపోయారు...
Ecuador kick off the World Cup today.
Here's their captain Enner Valencia faking an injury to avoid getting arrested over £13k of unpaid child support.
The former Everton striker was driven away on a stretcher while 13 policemen gave chase. pic.twitter.com/oNCfKMbj6t
రెండో గోల్స్ చేసి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కించుకున్న ఈక్వెడార్ కెప్టెన్ ఎన్నెర్ వాలెన్సియా, అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి గాయం డ్రామా ఆడి మైదానం వీడడం అందర్నీ ఆశ్చర్యానికి కలిగించింది. మెక్సికన్ క్లబ్ పచుకా క్లబ్ తరుపున ఆడేందుకు 2014లో 12 మిలియన్ల పౌండ్లతో ఒప్పందం కుదుర్చుకున్నాడు ఎన్నెర్ వాలెన్సియా...
అయితే మూడు సీజన్ల తర్వాత ఆ క్లబ్‌ని వీడిన ఎన్నెర్ వాలెన్సియా, మెక్సికోకి మారాడు. ఆ తర్వాత 2018 రష్యాలో జరిగిన వరల్డ్ కప్ క్వాలిఫైయర్స్‌లో చీలితో జరిగిన మ్యాచ్ సమయంలో చైల్డ్ సపోర్ట్ కోసం చెల్లిస్తానని చెప్పిన 13 వేల పౌండ్లు (దాదాపు 12 లక్షల 60 వేల రూపాయలు) చెల్లించలేకపోయాడు ఎన్నెర్. నాలుగేళ్లు గడుస్తున్నా ఈ మొత్తాన్ని చెల్లించడంలో వాలెన్సియా ఫెయిల్ అయ్యాడు...
దీంతో ఖతర్‌తో మ్యాచ్ ముగిసిన తర్వాత ఈక్వెడార్ ప్లేయర్ ఎన్నెర్ వాలెన్సియాని అరెస్ట్ చేసేందుకు పోలీసులు సిద్ధమయ్యారు. అరెస్ట్ వారెంట్‌తో స్టేడియానికి కూడా చేరుకున్నారు పోలీసులు. అయితే మ్యాచ్ చివరి నిమిషంలో గాయం డ్రామా ఆడిన ఎన్నెర్, స్టెచ్చర్‌పై మైదానం వీడాడు. అంబులెన్స్‌లో ఎన్నెర్ వాలెన్సియాతో పోలీసులు 13 మంది పోలీసులు కూడా వెంటవెళ్లడం విశేషం..