ఫిఫా వరల్డ్ కప్ 2022: గెలిచి నిలిచిన అర్జెంటీనా... మెస్సీకి మరో ఛాన్స్...

By Chinthakindhi Ramu  |  First Published Dec 1, 2022, 11:28 AM IST

ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో పోలాండ్‌పై 2-0 తేడాతో విజయం అందుకున్న అర్జెంటీనా... గ్రూప్ సీ నుంచి ప్రీక్వార్టర్స్‌కి పోలాండ్, అర్జెంటీనా..



ఫిఫా వరల్డ్ కప్ 2022 టోర్నీలో అర్జెంటీనా, కీలక మ్యాచ్‌లో గెలిచి ప్రీక్వార్టర్స్‌లోకి ప్రవేశించింది. గ్రూప్ సీలో పోలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 0-2 తేడాతో విజయం అందుకుంది అర్జెంటీనా. ఆట 46వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు అలెక్స్ మాక్ అలిస్టర్ గోల్ చేసి, 1-0 తేడాతో ఆధిక్యం అందించగా ఆట 67వ నిమిషంలో జులియన్ అల్వరెజ్ మరో గోల్ చేసి 2-0 ఆధిక్యాన్ని ఇచ్చాడు...

ఈ ఆధిక్యాన్ని చివరివరకూ కాపాడుకున్న అర్జెంటీనా, కీలక మ్యాచ్‌లో విజయం అందుకుంది. గ్రూప్‌ సీలో ఉన్న మెక్సికో, సౌదీ అరేబియాని 2-1 తేడాతో ఓడించడంతో అర్జెంటీనా లైన్ క్లియర్ అయ్యింది. సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో 2-1 తేడాతో ఓడిపోయిన అర్జెంటీనా, ఆ తర్వాత మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో 2-0 తేడాతో విజయం అందుకుంది...

Latest Videos

అయితే సౌదీ అరేబియా- మెక్సికో మధ్య మ్యాచ్‌ ఫలితం మీద అర్జెంటీనా ప్లేఆఫ్స్ ఆశలు ఆధారపడి ఉండడంతో లియోనెల్ మెస్సీకి పోలాండ్‌తో జరిగే మ్యాచ్ ఆఖరి వరల్డ్ కప్ మ్యాచ్ అవుతుందని అనుకున్నారంతా. అయితే మెక్సికో, సౌదీని ఓడించి అర్జెంటీనాకి లైన్ క్లియర్ చేసింది. లియోనెల్ మెస్సికీ ఇది 999వ మ్యాచ్ కాగా 22వ ఫిఫా వరల్డ్ కప్ మ్యాచ్...

🙌 See you both in the Round of 16! 🫶 | | pic.twitter.com/iu1vuwkH75

— FIFA World Cup (@FIFAWorldCup)

ఆఖరి ఫిఫా వరల్డ్ కప్ ఆడబోతున్న లియోనెల్ మెస్సీ, ఈసారి టైటిల్ గెలవాలనే భారీ ఆశలతో టోర్నీలో అడుగుపెట్టాడు. అయితే సౌదీ అరేబియాతో మ్యాచ్‌లో గోల్ చేసిన మెస్సీ, మెక్సికోతో జరిగిన మ్యాచ్‌లో కూడా గోల్ సాధించాడు. 

సూపర్ 16 రౌండ్‌లో అర్జెంటీనా జట్టు, ఆస్ట్రేలియాతో తలబడనుంది. నెదర్లాండ్స్ జట్టు, యూఎస్‌ఏతో తలబడబోతుంది. ఈ రెండు మ్యాచుల్లో గెలిచిన జట్లు, ప్రత్యర్థులుగా సూపర్ 8 రౌండ్‌కి చేరుకుంటాయి...  సూపర్ 16 రౌండ్‌లో పోలాండ్ జట్టు, ఫ్రాన్స్‌తో తలబడబోతోంది. ఇంగ్లాండ్ జట్టు, సెనెగల్‌తో మ్యాచ్ ఆడనుంది. 
 

click me!