సారీ... ఈ సారి ప్రేక్షకులు లేకుండానే ఒలింపిక్ ఈవెంట్స్... టోక్యోలో ఎమర్జెన్సీ కారణంగా...

By Chinthakindhi RamuFirst Published Jul 9, 2021, 10:15 AM IST
Highlights

50 శాతం కెపాసిటీతో ప్రేక్షకులను అనుమతించాలని భావించిన ఒలింపిక్స్ కమిటీ...

డెల్టా వెరియెంట్ కరోనా కేసులు పెరుగుతుండడంతో టోక్యో ఎమర్జెన్సీ... 

ప్రస్తుత పరిస్థితుల్లో ప్రేక్షకులను అనుమతించలేమని చేతులెత్తేసిన ఒలింపిక్స్ నిర్వహాకులు...

జపాన్‌ రాజధాని టోక్యోలో పెరుగుతున్న కరోనా కేసుల ఎఫెక్ట్, ఒలింపిక్స్‌పై పడింది. కొన్నాళ్ల కిందటి వరకూ పెద్దగా కరోనా భయం లేకపోవడంతో కోవిద్ ప్రోటోకాల్‌ను అనుసరించి, 50 శాతం కెపాసిటీతో లేదా 10 వేల మంది దాకా ప్రేక్షకులను ఈవెంట్స్ చూసేందుకు అనుమతించాలని భావించింది ఒలింపిక్స్ కమిటీ...

అయితే టోక్యో నగరంలో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా ఇప్పటికే అక్కడ ఎమర్జెన్సీ విధించింది జపాన్ ప్రభుత్వం. ఒలింపిక్ పోటీలు పూర్తి అయ్యేవరకూ ఈ ఎమర్జెన్సీ అమలులో ఉంటుంది. దీంతో ఒలింపిక్ ఈవెంట్స్ అన్నీ ప్రేక్షకులు లేకుండానే, ఖాళీ స్టేడియాల్లో జరగనున్నాయి...

‘ఎమర్జెన్సీ అమలులో ఉన్న ఏరియాల్లో జనాలు ఒక దగ్గర చేరడానికి అనుమతి ఉండదు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్ ఈవెంట్‌కి సంబంధించిన టికెట్లు అమ్మడంతో, వాటిని కొనుగోలు చేసిన వారికి ‘క్షమాపణలు’ చెబుతూ స్టేట్‌మెంట్ విడుదల చేసింది ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ...

‘టికెట్ కొనుగోలు చేసినవారికి, లోకల్ ఏరియా ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాం. ఒలింపిక్స్ వాయిదా పడినప్పటి నుంచి ఈ రోజు దాకా ప్రేక్షకుల సమక్షంలోనే పోటీలు నిర్వహించాలని భావించాం. అయితే పరిస్థితులు అనుకూలించడం లేదు...’ అంటూ కామెంట్ చేశారు ఒలింపిక్స్ ఆర్గనైజింగ్ కమిటీ (ఐఓసీ) ప్రెసిడెంట్ థామస్ బాచ్...

click me!