Commonwealth Games 2022: కామన్వెల్త్ క్రీడల బడ్జెట్ మన దేశ రాజధాని ఢిల్లీ బడ్డెట్ కంటే ఎక్కువ. 20 ఏండ్ల తర్వాత తమ దేశంలో నిర్వహిస్తున్న కామన్వెల్త్ క్రీడల కోసం ఆ దేశం భారీగా ఖర్చు పెడుతున్నది.
ఇంగ్లాండ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కామన్వెల్త్ గేమ్స్-2022 కు మరికొద్దిసేపట్లో తెరలేవనుంది. గురువారం (జులై28) బర్మింగ్‌హోమ్ వేదికగా స్థానిక కాలమానం రాత్రి 7 గంటలకు ప్రారంభం కాబోయే ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమైంది. 20 ఏండ్ల తర్వాత (1934లో తొలిసారి లండన్ లో, 2002లో మాంచెస్టర్ లో రెండోసారి) తమ దేశంలో నిర్వహిస్తున్న కామన్వెల్త్ క్రీడల కోసం ఆ దేశం భారీగా ఖర్చు పెడుతున్నది. ఈ క్రీడల కోసం ఇంగ్లాండ్ ఏకంగా 778 మిలియన్ పౌండ్లు (అంటే భారత్ లో రూ. 80 వేల కోట్లు) ఖర్చు చేస్తున్నది. 52 దేశాలు పాల్గొనబోయే క్రీడలకు ఇంత ఖర్చు చేయాలా..? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నా ఇది నిజం.
కామన్వెల్త్ క్రీడల బడ్జెట్ మన దేశ రాజధాని ఢిల్లీ బడ్డెట్ కంటే ఎక్కువ. 2022-23 ఆర్థిక సంవత్సరానికి ఢిల్లీ బడ్డెట్ రూ. 75,800 కోట్లు. ఒక్క ఢిల్లీనే కాదు.. భారతదేశంలో పలు చిన్న రాష్ట్రాల కంటే కామన్వెల్త్ క్రీడల బడ్జెట్టే ఎక్కువ అని గణాంకాలను చూస్తే అర్థమవుతున్నది.
undefined
ఉత్తరాఖండ్ (రూ. 57,400 కోట్లు), హిమాచల్ ప్రదేశ్ (రూ. 51,365 కోట్లు), గోవా (రూ. 21 వేల కోట్లు),ఈశాన్య రాష్ట్రాలలో అసోం (రూ. 99 వేల కోట్లు) మినహా మిగిలిన రాష్ట్రాల (అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, నాగాలాండ్, మేఘాలయా, మిజోరాం, త్రిపుర) 2022-23ల వార్షిక బడ్జెట్ కామన్వెల్త్ క్రీడలకు కేటాయించిన బడ్జెట్ కంటే చాలా తక్కువగా ఉంది.
ఎవరిచ్చారు..?
ఈ ఆటల నిర్వహణకు ఇంగ్లాండ్ ప్రభుత్వం 75 శాతం (594 మిలియన్ పౌండ్లు) సమకూర్చింది. ఇక బర్మింగ్‌హోమ్ సిటీ కౌన్సిల్ మిగిలిన 25 శాతం నిధులు (184 మిలియన్ పౌండ్లు) అందిస్తున్నది.
ఎందుకింత..?
ఇంత భారీ బడ్జెట్ కేటాయించి కామన్వెల్త్ క్రీడలను నిర్వహించడం అవసరమా...? అని ఆరోపించేవారు లేకపోలేదు. వాస్తవానికైతే 2022 కామన్వెల్త్ క్రీడలు డర్బన్ (దక్షిణాఫ్రికా) లో జరగాలి. ఆ మేరకు డర్బన్ బిడ్ కూడా వేసింది. కానీ ఇంత ఖర్చు మేం భరించలేం మహాప్రభో.. అని డర్బన్ ఈ క్రీడల నిర్వహణ నుంచి తప్పుకుంది. కానీ బర్మింగ్‌హోమ్ మాత్రం భారీగా ఖర్చు చేసేందుకు వెనుకాడం లేదు.
Commonwealth Games 2022: Birmingham event to cost £778m as government announces budget https://t.co/JllSBGqX8K
— Dan Roan (@danroan)బర్మింగ్‌హోమ్ ఇంగ్లాండ్ లోని వెస్ట్ మిడ్లాండ్ రీజియన్ కు చెందిన కీలక నగరం. ఇప్పటికే ఈ నగరంలో సకల సౌకర్యాలు, వసతులూ ఉన్నాయి. దీని క్రేజ్ ను మరింత పెంచే ఉద్దేశంతో ఇంగ్లాండ్ ప్రభుత్వం ఇక్కడ భారీగా ఖర్చు చేసింది.
Organisers say the revamped Alexander Stadium in for the Commonwealth Games is on course and on budget, to be ready in spring 2022. The new West Stand is taking shape in the £72m scheme. The stadium will have a 30,000 capacity. Read more: https://t.co/8FKTFJogOv pic.twitter.com/Kd10SLa6CY
— BBC News Midlands (@bbcmtd)ఏం చేశారు..?
72 దేశాలు పాల్గొనబోయే 22వ కామన్వెల్త్ క్రీడలలో సుమారు 5వేలకు పైగా అథ్లెట్లు పాల్గొంటున్నారు. వీరితో పాటు సిబ్బంది, కోచ్ లే గాక ఆ దేశాలకు చెందిన అభిమానులు కూడా పెద్దఎత్తున పాల్గొంటారు. దీంతో మౌళిక వసతుల కల్పన, కొత్త స్టేడయాల నిర్మాణం, ఇప్పటికే ఉన్నవాటి పునరుద్ధరణతో పాటు నగరానికి అదనపు హంగులు చేకూర్చారు. పర్యాటకాన్ని వృద్ధి చేసేందుకు గాను కొన్ని అభివృద్ధి పనులకు నిధులు కేటాయించారు. భవిష్యత్ లో వాణిజ్య సముదాయాలు, సమావేశాలు జరుపుకునేందుకు నగరానికి కొత్త రంగులు అద్దారు.